Sattu Powder Benefits And Side Effects: సత్తు పిండి ఒక పురాతన భారతీయ ఆహారం. ఇది ముఖ్యంగా బియ్యం, గోధుమలు లేదా జొన్నల నుంచి తయారు చేయబడుతుంది. ఇది పోషకాల సమృద్ధి, తేలికగా జీర్ణమయ్యే ఆహారం. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది భారతదేశంలో అనేక ప్రాంతాలలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ లో ప్రసిద్ధి చెందింది. సాధారణంగా బతుకమ్మ పండుగ సమయంలో నైవేద్యంగా సమర్పించబడుతుంది. ఈ సత్తు పిండి తినడం వల్ల కలిగే లాభాలు కష్టాలు గురించి తెలుసుకుందాం.
ఆరోగ్య లాభాలు:
సత్తులో కార్బోహైడ్రేట్లు , ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు అధితంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఐరన్ లెవల్స్ అధికంగా ఉంటాయి. రక్తంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడంలో కూడా సహయపడుతుంది. దీని కారణంగా వేసవిలో కలిగే అలసట నుంచి ఉపశమనం పొందవచ్చు. సత్తులో అధిక శాతం ఫైబర్ ఉంటుంది. అధిక బరువు సమస్యలతో ఇబ్బంది పడేవారు దీని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావాన్ని కలిగిస్తుంది. తద్వారా ఆకలిని నియంత్రించడంలో అతిగా తినడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న వారికి మంచిది.
ఇందులో ఉండే ఫైబర్ బరువును తగ్గించడంలో మాత్రమేకాకుండా షుగర్ లెవల్స్‌ను కొంట్రోల్ చేయడంలో కూడా సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ
దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మధుమేహం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు నుంచి వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సత్తు పిండి గుండె సంబంధిత సమస్యల నుంచి కూడా ఎంతో మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఐరన్ గుండెను, కండరాల పనితీరును మెరుగుపరుచుతుంది. మలబద్ధం, గ్యాస్, అజీర్ణం వంటి ఇతర సమస్యల నుంచి కూడా ఇది సహయ పడుతుంది. ఇది మంచి బ్యాక్టీరియా పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది, ఇది మొత్తం జీర్ణ ఆరోగ్యానికి మంచిది.
సత్తులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో అంటువ్యాధులకు గురయ్యే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.సత్తులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి సహాయపడతాయి. ఇది ముడతలు మరియు చర్మం సడలడం వంటి వయస్సు పెరిగే సంకేతాలను నివారించడంలో సహాయపడుతుంది.
సత్తు పిండిని ఎలా తయారు చేయాలి:
సత్తు పిండిని తయారు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒక సాధారణ పద్ధతి:
బెండులు, శనగలు, మొగ్గలు, రాగులు వంటి పప్పుధాన్యాలను రాత్రంతా నానబెట్టుకోండి. పప్పుధాన్యాలను నీటిలో లేదా ఆవిరిలో ఉడికించాలి.
ఉడికించిన పప్పుధాన్యాలను ఎండబెట్టి, పొడిగా చేయాలి. పొడిని మెత్తగా రుబ్బుకోవాలి.
సత్తు పిండిని ఎలా తినాలి:
రొట్టెలు: సత్తు పిండితో రొట్టెలు చేసుకోవచ్చు. ఈ రొట్టెలు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. వాటిని అనేక రకాల కూరలతో తినవచ్చు.
పిండి: సత్తు పిండిని ఉపయోగించి పిండి వంటకాలు కూడా చేయవచ్చు.
జావ: సత్తు పిండిని జావగా కూడా తినవచ్చు. ఇది వేసవిలో చాలా రిఫ్రెష్ గా ఉంటుంది.
అధికంగా తీసుకోవడం వల్ల సమస్యలు:
సత్తు పొడిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల అధికంగా తీసుకుంటే ఉబ్బరం, గ్యాస్ లేదా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
బరువు పెరుగుదల: మొత్తం క్యాలరీలను పరిగణనలోకి తీసుకోకుండా సత్తు పొడిని అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతారు.
అలెర్జీ: శెనగపిండి లేదా శనగపిండికి అలెర్జీ ఉన్నవారు అలెర్జీని నివారించడానికి సత్తు పొడిని తీసుకోకూడదు.
ముఖ్య గమనిక: సత్తు పొడి పోషకాలకు మంచి మూలం అయినప్పటికీ, దీన్ని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే, మీ వైద్యుడితో మాట్లాడండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి