Health Benefits Of Sattu In Telugu: మండే ఎండల కారణంగా చాలా మంది తీవ్ర డిహైడ్రేషన్ సమస్యల బారిన పడుతూ ఉంటాయి. అయితే చాలా మంది ఇది చిన్న సమస్యేన లైట్ తీసుకుంటూ ఉంటారు. నిజాని డిహైడ్రేషన్ కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా రోగనిరోధక శక్తి కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో శనగపిండితో తయారు చేసిన (సత్తు డ్రింక్) తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన ఫైబర్, ఐరన్, ప్రొటీన్‌తో పాటు కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వేసవిలో ఈ డ్రింక్ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సత్తు డ్రింక్‌ను ప్రతి రోజు తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
శనగ పిండితో తయారు చేసిన సత్తు డ్రింక్ తాగడం వల్ల కలిగే లాభాలు:
శరీరం చల్లగా మారుతుంది:
శనగ పిండితో తయారు చేసిన సత్తు డ్రింక్ తాగడం వల్ల శరీర లోపలి నుంచి చల్లబడుతుంది. అంతేకాకుండా ప్రతి రోజు తాగడం వల్ల శరీర కూడా హ్రైడట్గా మారుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనిని ప్రతి రోజు ఖాళీ కడుపుతో తాగడం వల్ల వేడి స్ట్రోక్ నుంచి విముక్తి కలుగుతుంది. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది.
పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది:
సత్తులో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. దీంతో పాటు పొట్ట సమస్యలు, మలబద్దకం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా తీవ్ర పొట్ట సమస్యలు, కడుపు నొప్పి, అసిడిటీ వంటి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది:
సత్తు డ్రింక్‌ను ప్రతి రోజు తాగడం వల్ల మధుమేహంతో బాధపడేవారికి ప్రభావవంగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు బ్లడ్‌లోని షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు మధుమేహాన్ని నియంత్రిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బరువు తగ్గడం:
శనగ పిండితో తయారు చేసిన సత్తు డ్రింక్‌ను తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. ఇందులో ఉండే గుణాలు, పోషకాలు పొట్టను నిండుగా ఉంచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అలాగే తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిచేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. దీంతో పాటు ఇందులో లభించే కేలరీలు, ఫైబర్ శరీరాన్ని దృఢంగా ఉంచేందుకు సహాయపడుతుంది. దీంతో పాటు జీర్ణక్రియను కూడా సులభంగా మెరుగుపరుస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి