Running Tips: శీతాకాలంలో రన్నింగ్‌ చేసేవారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే!

Running Tips: ప్రతి రోజు వ్యాయామాలు చేయడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. కాబట్టి రన్నింగ్‌ చేయాలనుకునేవారు కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తూ చేయడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2023, 01:04 PM IST
Running Tips: శీతాకాలంలో రన్నింగ్‌ చేసేవారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే!

 

Running Tips: వ్యాయామాల్లో అతి ముఖ్యమైనది రన్నింగ్..ప్రతి రోజు 2 నుంచి 3 కిలో మీటర్ల వరకు రన్నింగ్‌ చేయడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఆధునిక జీవనశైలి కారణంగా వస్తున్న అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది వాకింగ్‌తో పాటు రన్నింగ్‌ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే రన్నింగ్ చేయడం ఎంత ముఖ్యమే ఈ సమయంలో కొన్ని నియమాలు పాటించడం అంతే ఇంపార్టేంట్‌ అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రన్నింగ్‌ చేసే క్రమంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రన్నింగ్‌ చేయాలనుకునేవారు తప్పకుండా ఈ పద్దతులు పాటించండి:
1. ప్రతి రోజు పార్కుకు వెళ్లండి:

రన్నింగ్‌, వాకింగ్‌ చేయాలనుకునేవారు ప్రతి రోజు రోడ్లపై పరుగెత్తడానికి బదులుగా పార్కుకు వెళ్లడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సరళ మార్గంలో నడవడానికి బదులుగా వృత్తాకారంలో పరిగెత్తడం చాలా మంచిది. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల శరీరంలో చాలా రకాల మార్పులు వస్తాయి. 

2. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి:
రన్నింగ్‌ చేసేవారు తప్పకుండా ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రన్ని చేసి కూడా వెస్ట్‌ అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రత్యేకించి శీతాకాలంలో వాకింగ్‌ చేసేవారు ప్రతి రోజు కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. 

3. మంచి షూ ధరించండి:
రన్నింగ్‌ చేసే క్రమంలో మంచి షూ ధరించడం కూడా చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సౌకర్యవంతమైన బూట్లు ధరించిన తర్వాత లేస్‌ కూడా బాగా కట్టుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కాళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కాళ్లపై ఒత్తిడి పడొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: Viral News: మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? తప్పక తెలుకోవాల్సిన ఆసక్తికర విషయం!

4. నిద్ర మబ్బుతో నడవకండి:
ప్రస్తుతం చాలా మంది నిద్రలేచిన వెంటనే రోడ్లపైకి వచ్చి నడుస్తూ ఉంటారు. దీని కారణగా కూడా అనేక రకాల సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. ముఖ్యంగా చాలా మందిలో రన్నింగ్ చేసే క్రమంలో ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ఇదేనని నిపుణులు సూచిస్తున్నారు. 

5. వాటర్ బాటిల్ తీసుకువెళ్లండి:
రన్నింగ్‌ చేసే క్రమంలో చాలా మంది శరీరాలు డీహైడ్రైట్‌ అవుతూ ఉంటాయి. దీని కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి రోజు వాటర్‌ తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. 

Also Read: Viral News: మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? తప్పక తెలుకోవాల్సిన ఆసక్తికర విషయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News