Reduce Sweating Tips: చెమట ఎక్కువగా పడుతుందా.. అయితే ఇవి తినండి..!

Reduce Sweating Tips: ప్రస్తుతం వేసవి కాలం నుంచి వర్షకాలంలోకి అడుపెడుతున్నాం. అయితే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 23, 2022, 02:43 PM IST
  • చెమట ఎక్కువగా పడుతుందా..
  • కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినండి
  • అవిసె గింజలను తినండి
Reduce Sweating Tips: చెమట ఎక్కువగా  పడుతుందా.. అయితే ఇవి తినండి..!

Reduce Sweating Tips: ప్రస్తుతం వేసవి కాలం నుంచి వర్షకాలంలోకి అడుపెడుతున్నాం. అయితే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీని కారణంగా వాన రావడానికి ముందు శరీరానికి ఎక్కువగా చెమటలు పట్టడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది సాధారణమే అయినప్పటికీ.. శరీరానికి ఎక్కువగా చమటలు రావడం మాములు విషయం కాదు. దీని కారణంగా అధిక బరువు, బీపీ, మధుమేహం సమస్య కూడా వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ సమస్యల నుంచి రాకుండా ముందు జాగ్రత్త కోసం ఆహారంలో మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని రకాల ఆహార నియమాలు పాటించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరంలో చెమట ఎక్కువగా ఉంటే.. ఈ ఆహారాలను తీసుకోండి:

కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినండి:

బలమైన ఎముకలకు కాల్షియం ఎంతో అవసరం. అదే విధంగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కాల్షియం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కావున రోజూ తీసుకునే ఆహారంలో కాల్షియం పుష్కలంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇందుకోసం పాలు, పెరుగు, నువ్వులుతో చేసిన ఆహారం ఎక్కువగా తినాలి.

అవిసె గింజలను తినండి:

ప్రతి ఒక్కరికి అవిసె గింజల ప్రయోజనాల గురించి తెలుసు.. ఇవి జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గించడమే కాకుండా..  బరువును  కూడా తగ్గిస్తాయి. అంతేకాకుండా వీటిలో ఉండే గుణాలు చెమటను నియంత్రిస్తాయి.

తగినంత నీరు తాగాలి:

విపరీతమైన చెమట సమస్యతో బాధపడేవారు తగినంత నీరు త్రాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీరాన్ని నీటితో హైడ్రేట్ గా ఉండనివ్వండం వల్ల శరీరానికి చమట రాకుండా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి రోజుకు 7 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి.

విపరీతమైన చెమట కారణం ఇవే..!

1. చెమట పట్టే సమస్య పెరగకుండా ఉండాలంటే ఆహారం తక్కువగా తీసుకోవాలి.
2. కెఫిన్ తీసుకోవడం తగ్గించండి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక చెమట పట్టుతుందని నివేధికలు తెలిపాయి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

 

 

Also Read: Benefits of Jamun Fruit: వేసవిలో నేరేడు తింటే స్పెర్మ్ కౌంట్ అమాంతం పెరుగుతుంది!

Also Read: Sprouts for Diabetes: మీకు డయాబెటిస్ ఉందా..? అయితే ఇది మీ కోసమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News