Weight loss:
చాలామంది సన్నబడడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎక్ససైజ్ దగ్గర నుంచి కఠినమైన డైట్ వరకు వాళ్లు ఫాలో అవ్వండి అంటూ ఉండదు. అయినా చాలా సందర్భాలలో రిజల్ట్ అనుకున్నంతగా రాదు. ఒక్కొక్కసారి కఠినంగా డైట్ చేసిన కారణంగా కాస్త సన్నబడిన మళ్లీ తిరిగి వెంటనే లావు వచ్చేస్తారు. ఇది కేవలం మన జీర్ణవ్యవస్థలో ఉన్న సమస్య వల్ల జరుగుతుంది.
అయితే పొద్దున్నే ఖాళీ కడుపున ధనియాల నీళ్లు తాగడం వల్ల త్వరగా సన్నబడడమే కాకుండా కడుపు శుభ్రపడుతుంది,మెటపాలిజం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల క్రమంగా తగ్గిన మళ్లీ తిరిగి విపరీతంగా లావు కాకుండా ఉంటారు. మనం వంటలో విరివిగా వాడే ధనియాలలో పొటాషియం ,కాల్షియం ,మెగ్నీషియం ,విటమిన్ సి ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడంతోపాటు సహజంగా ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి.
వీటిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. రోజు కాళీ కడుపున ధనియాల నీళ్లు తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుంది. తద్వారా గ్యాస్ ,ఉబ్బరం ,అల్సర్ వంటి ఎన్నో ఉదర సంబంధిత సమస్యలు నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది. పైగా ఈ వాటర్ గుండె ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది.
రోజు ధనియాలు నీళ్లు తీసుకోవడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు బరువు నియంత్రణలోకి వస్తుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని కరిగించడంలో ధనియాలు ఎంతో సహాయపడతాయి. ఇది ఇంటి వద్దనే ఎంతో సులభంగా చేసుకోవచ్చు. పైగా ఇది సహజసిద్ధమైనది కాబట్టి శరీరంపై ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక రెండు స్పూన్ల ధనియాలను ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టి ఓవర్ నైట్ వదిలేయాలి. ఇలా రాత్రంతా నానిన ధనియాల నీళ్లను పొయ్యి మీద పెట్టి బాగా మరిగించి మూత పెట్టి చల్లారనివ్వాలి.
గోరువెచ్చగా అయిన తర్వాత రోజు ఈ నీటిని ఖాళీ కడుపుతో సేవించాలి. ఇలా చేయడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషక విలువలు అందుతాయి. రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా జలుబు ,దగ్గు ,కఫం ,గ్యాస్ లాంటి పలు రకాల సమస్యలు దూరం అవుతాయి. డయాబెటిస్ ఇలా రోజు ధనియాల వాటర్ తీసుకోవడం ఎంతో మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది.
మరింకెందుకు ఆలస్యం సర్వ రోగ నివారిణి ధనియాల వాటర్ ని రోజు క్రమం తప్పకుండా తాగేయండి.
గమనిక:
పైన ఇచ్చిన సమాచారాన్ని నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. అయితే వీటిని పాటించే ముందు ఒకసారి మీ డాక్టర్ను సంప్రదించడం మంచిది.
Also read: Chandrababu Case Updates: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు మళ్లీ నిరాశ, విచారణ వాయిదా
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..