Oolong Tea For Diabetes Control: డయాబెటిస్తో బాధపడుతున్న వారిలో ఒక్కసారిగా రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగితే ప్రాణాంతకంగానూ మారొచ్చు. దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధు, కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరికొందరిలోనైతే గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి.. రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా శరీరంలో ఒకవేళ చక్కర పరిమాణాలు పెరిగితే.. తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీనికోసం ఆయుర్వేద నిపుణులు సూచించిన ఆయుర్వేద మూలికలు కలిగిన టీ ని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది. ఈటీని తాగడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉండడమే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే దీనికోసం మీరు ప్రతిరోజు ఊలాంగ్ టీని తాగాల్సి ఉంటుంది.
ఊలాంగ్ టీలో లభించే పోషకాలు:
ఊలాంగ్ టీలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, కెరోటిన్, సెలీనియం, మాంగనీస్, కాపర్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతి రోజు తాగడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఊలాంగ్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులు ఊలాంగ్ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా తరచుగా ఒత్తిడి సమస్యలతో బాధపడే వారు ఈ టీ ని తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
2. ప్రస్తుతం చాలామంది బరువు తగ్గడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ శరీర బరువు తగ్గలేకపోతున్నారు. అయితే శరీర బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఈ టీని రెండుసార్లు తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్ ను సులభంగా నియంత్రిస్తాయి.
3. ఊలాంగ్ టీని ప్రతిరోజు తాగడం వల్ల దంతాల సమస్యలు కూడా దూరమవుతాయని ఆయుర్వేదనలు చెబుతున్నారు. చిగుళ్లలో సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు ఈ టీ ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Prabhas Movies : ఆరు నెలల్లో మూడు ప్రభాస్ సినిమాలు.. ఇక ఫాన్స్ కి పండగే!
Also Read: Rashmika Mandanna Emotional: మగాడిలా ఉన్నావంటూ ట్రోల్స్.. రష్మిక ఏమందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook