ఆరోగ్యంగా ఉండాలంటే.. పాత తరం తిండే మేలు!

Last Updated : Nov 4, 2017, 11:12 AM IST
ఆరోగ్యంగా ఉండాలంటే.. పాత తరం తిండే మేలు!

ఆరోగ్యాన్ని ఉండేందుకు ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయినా కూడా ఎదో ఒకటి వస్తూనే ఉంది. ఎంత డైట్ కంట్రోల్ చేసినా కూడా ఆరోగ్య సమస్య వస్తోంది. ఎందుకలా అని ఆలోచిస్తున్నారా? ఇందుకు కారణం మనం తినే తిండట. అమెరికా వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు పోషకాహారం లోపంపై ఒక పరిశోధన చేశారు. ఇందులో తెలిసిన నిజం ఏంటంటే.. ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారంలో వైవిధ్యం తక్కువని, ఇది పోషకాహార లోపానికి దారితీస్తోందని చెప్పారు. అంతేకాదు ఇప్పుడు తీసుకుంటున్న ఆహారం కంటే పాతతరం ఆహారం పూర్తి భిన్నంగా ఉండేదని తెలిపారు.

ఇప్పుడు తీసుకుంటున్న ఆహారంవల్ల మానవ జన్యువులో వైవిధ్యం వచ్చి చేరిందని, తద్వారా పౌష్టికాహారలోపం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ప్రస్తుతం పాలిష్, శుద్ధి చేసిన ఆహారపదార్థాలకు మార్కెట్ లో గిరాకీ బాగుంది. తిండిగింజల నుంచి తయారు చేసే నూనెలు, పిండిపదార్థాలు, చక్కెరలు పాతకాలపు ఆహారంలో లేవు. అవన్నీ వారు ఆహారంలో భాగంగానే తీసుకునేవారని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలనుకొనే వారికి పాత తరం తిండే మేలని పేర్కొన్నారు. ఈ పరిశోధనల వివరాలు న్యూట్రీషన్‌ రివ్యూస్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. 

Trending News