How to Over come Nutrition Deficiency in Telugu: శరీరంలోని అన్ని అంగాల పనీతిరు మెరుగ్గా ఉండాలంటే పలు విటమిన్లు చాలా అవసరం. ఏ అంగం పనితీరు సరిగ్గా లేకపోయినా సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ డి నుంచి విటమిన్ బి12 వరకూ వివిధ రకాల విటమిన్ల లోపం తలెత్తితే ఏర్పడే సమస్యలు గురించి చర్చిద్దాం..
రోజూ మనిషి శరీరానికి అవసరమైన న్యూట్రియంట్ల కంటే తక్కువ అందితే న్యూట్రిన్ లోపం సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా శరీరం పనితీరు అంటే మెటబోలిజంపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే శరీరంలో అన్ని అంగాలు సక్రమంగా పనిచేయాలంటే అన్నిరకాల విటమిన్లు తగిన మోతాదులో తినే ఆహార పదార్ధాల రూపంలో తీసుకోవాలి. మ్యాక్రో, మైక్రో న్యూట్రియంట్ల లోపాన్ని సరిచేయడం చాలా చాలా ముఖ్యం. సరైన ఆహార పదార్ధాలు, న్యూట్రియంట్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
విటమిన్ ఎ అనేది శరీరానికి అవసరమైన విటమిన్లలో అతి ముఖ్యమైంది. విటమిన్ ఎ లోపముంటే పలు ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా కంటి సమస్యలు, రోగ నిరోధకతకు చెందిన సమస్యలు తలెత్తుతాయి. బాజ్రా, పెసరపప్పు, అమరనాథ్ ఆకులు, చిలకడదుంప, బొప్పాయి, మామిడి, నువ్వులను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా విటమిన్ ఎ లోపాన్ని సరిచేయవచ్చు. విటమిన్ ఎ అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. డైటరీ ఫ్యాట్ జీర్ణానికి ఉపయోగపడుతుంది.
Also Read: Diabetes Diet: మధుమేహం తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడే పదార్ధమిదే
ఐరన్ లోపం అనేది మనిషికి లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఐరన్ లోపముంటే ఎనీమియా, అలసట వంటి సమస్యలు ఏర్పడతాయి. ఐరన్ లోపమున్నప్పుడు రాగులు, కిస్మిస్, లెంటిల్స్, నువ్వు గింజలు, ఆకుపచ్చని ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. అదే సమయంలో విటమిన్ సి పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలు కూడా డైట్‌లో భాగంగా చేసుకోవాలి.
ఐయోడిన్ లోపం అనేది మనిషి శరీరాన్ని బలహీనం చేస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్ గ్రాండ్ పెరిగేలా చేస్తుంది. అందుకే ఇంట్లో వినియోగించే ఉప్పు అయోడైజ్డ్ అయుండాలి. పెరుగు, పాల ఉత్పత్తుల్లో అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది.
ఇక మనిషి శరీరానికి కావల్సిన విటమిన్లలో మరో ముఖ్యమైంది విటమిన్ డి. విటమిన్ డి అనేది మనిషి శరీరంలో స్టెరాయిడ్ హార్మోన్‌లా పనిచేస్తుంది. ఎముకల బలానికి, రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. విటమిన్ డి పుష్కలంగా లభించేది సూర్య రశ్మిలో. ఇక ఇది కాకుండా మష్రూం, సాల్మన్ చేప, గుడ్లలో కూడా విటమిన్ డి కావల్సినంతగా లభిస్తుంది.
ఇక శరీరంలో అన్నింటికంటే ముఖ్యమైందిగా భావించేది విటమిన్ బి12. విటమిన్ బి12 లోపం అనేది సాధారణంగా శాకాహారుల్లో ఎక్కువగా ఉంటుంది. వృద్ధుల్లో కూడా ఈ సమస్య ఎక్కువే కన్పిస్తుంది. విటమని బి12 లోపాన్ని సరిచేసేందుకు పాలు, క్లోరెల్లా, పెరుగు, వెన్న వంటివి డైట్‌లో భాగంగా చేసుకోవాలి. మాంసాహారులైతే మాంసం తినడం ద్వారా విటమిన్ బి12 లోపం సరిచేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook