Tomatoes Benefits: పోషకాలు పుష్కలంగా ఉండే టమోటాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..

Tomatoes Health Benefits: టమాటాల్లో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.  అంతేకాదు ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

Written by - Renuka Godugu | Last Updated : Apr 24, 2024, 12:46 PM IST
Tomatoes Benefits: పోషకాలు పుష్కలంగా ఉండే టమోటాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..

Tomatoes Health Benefits: టమాటాల్లో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.  అంతేకాదు ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. టమాటాల్లో గుండె ఆరోగ్యంచ కేన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. కంటి ఆరోగ్యం, బరువు తగ్గుతుంది.

పోషకాలు పుష్కలం..
టమాటాల్లో కావాల్సిన పోషకాలు ఉంటాయి. విటమిన్ సీ, ఏ, కే, థయామిన్ బీకాంప్లెక్స్ ఉంటాయి. నియాసిన్, ఫోలేట్‌ కూడా ఉంటుంది. అంతేకాదు పొటాషియం, మ్యాంగనీస్, క్రోమీయం ఉంటాయి. అంతేకాదు టమాటాల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. మంచి జీర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం..
టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి సంబంధం కలిగి ఉంటుంది. లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌, వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. టమాటాలు బీపీ స్థాయిలను తగ్గిస్తాయి. బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ తగ్గించి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

కేన్సర్..
టమాటాల్లో కేన్సర్ కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. కొన్ని నివేదికల ప్రకారం టమాటాలు కేన్సర్ కణాలను నివారిస్తాయి.  ప్రోస్టేట్, కాలేయం, కడుపు కేన్సర్ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. టమాటాల్లో ఫ్రీ రాడికల్స్ నివారిస్తుంది. సెల్‌ డ్యామేజ్ కాకుండా ప్రేరేపిస్తుంది.

ఇదీ చదవండి: వెలగపండులో వెలకట్టలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..

స్కిన్ ఆరోగ్యం..
టమాటాలు చర్మ ఆరోగ్యానికి మంచిది. విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. ఇది కొల్లాజెన్‌  ఉత్పత్తికి తోడ్పడుతుంది. టమాటాల్లో నిత్యయవ్వనం సొంతమవుతుంది. ఇందులో ఉండే లైకోపీన్, బీటా కెరోటీన్ సూర్యుడి హానికర కిరణాల నుంచి కాపాడుతుంది. టమాటా జ్యూస్, గుజ్జు ముఖానికి అప్లై చేయడం వల్ల ట్యాన్ తొలగిపోతుంది.

కంటి ఆరోగ్యం..
టమాటాల్లో కావాల్సినంత విటమిన్ ఏ ఉంటుంది. లూటీన్, జీయాంథిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఇదీ చదవండి: మామిడిపండ్లను తినబోయే ముందు నీళ్లలో ఎందుకు  నానబెట్టాలి?

బరువు నిర్వహణ..
టమాటాల్లో వెయిట్‌ నిర్వహిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. టమాటాల్లో వాటర్ కేలరీలు తక్కవగా ఉంటాయి. ఫైబర్ టమాటాల్లో పుష్కలంగా ఉంటాయి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News