Seeds For Skin Whitening: నేటి కాలంలో అందంగా కనిపించడం కోసం వివిధ రకాల క్రీములు, ప్రొడెక్ట్స్, ఫేస్ ప్యాక్స్, ఫేస్ జెల్స్‌ను ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించడం వల్ల చర్మ సంరక్షణ దెబ్బతింటుంది. ఇందులో ఉండే హానికరమైన కెమికల్స్ ఫెస్‌పై మొటిమలు, దురద, మచ్చలు కలిగిస్తాయని చర్మనిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ప్రొడెక్ట్స్‌ను ఉపయోగించకుండా సహజంగా కాంతివంతమైన చర్మాని పొందవచ్చు.అది ఎలాగో తెలుసుకుందాం.
సహజమైన, కాంతివంతమైన చర్మం కోసం ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందులోను నట్స్, సీడ్స్‌లను ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అందంగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆహారంలో ఎటువంటి పదార్థాలు ఉపయోగించాలి? ఎలాంటి నట్స్ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది?
చర్మానికి అందాన్ని పెంచే నట్స్, విత్తనాలు:
బాదం:
బాదంలో విటమిన్ E, యాంటీఆక్సిడెంట్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి. ఇందులో జింక్ అధికంగా ఉండటం వల్ల గాయాలను త్వరగా మాయం చేయడంలో అలాగే మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది.
చియా:
చియా గింజలు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఒమేగా-3, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది.
ఫ్లాక్స్:
చర్మం ఆరోగ్యంగా ఉంచడంలో ఫ్లాక్స్ సీడ్స్ మేలు చేస్తాయి. ఇందులో ఒమేగా-3, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దీని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు, ముడతలు రాకుండా సహాయపడుతాయి.
సన్‌ఫ్లవర్ సీడ్స్:
సనఫ్లవర్ గింజలును ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో తినడం వల్ల ఇందులో ఉండే విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ నుంచి రక్షించడంలో ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా ఇందులోని జింక్ చర్మం ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తాయి.
సోంపు:
సోంపు గింజలు కేవలం ఆరోగ్యానికే మాత్రమే కాకుండా అందానికి కూడా చాలా మంచివి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి.
ఈ గింజలను తినడంతో పాటు వ్యాయామం, పోషకరమైన ఆహారం తీసుకోవడం వల్ల అందంగా కనిపిస్తారు. జంక్ ఫూడ్స్‌ను, అతిగా వేయించిన నూనె పదార్థాలు తినడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు కలుగుతాయి. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పండ్లు, కూరగాయాలు తినడం వల్ల ఎలాంటి సమస్యల బారిన పడకుండా ఉంటారు.
Also Read: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి