Mushroom For Diabetes: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది మధుమేహా సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ప్రస్తుతం వెల్లడైన వైద్య నివేదకల ప్రకారం.. చాలా మంది చక్కెర వ్యాధి సమస్య బారిన పడుతున్నారని పేర్కొన్నాయి. ఈ మస్యల నుంచి విముక్తి పొందడానికి పలు రకాల ఆహార నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ హెల్తీ డైట్‌ను తీసుకోవడం వల్ల మధుమేహం రోగులు అనేక ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఆ సూపర్ ఫుడ్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సూపర్ ఫుడ్:
- డయాబెటిక్ రోగులు క్రమం తప్పకుండా మష్రూమ్‌ను వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ప్రోటీన్, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ డి, కాపర్, సెలీనియం, ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి.
- పుట్టగొడుగులను తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హృదయ సంబంధిత జబ్బులు తొలగిపోతాయి.
- పుట్టగొడుగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ పరిమాణం తక్కువగా ఉన్నందున రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు కృషి చేస్తుంది.
- పుట్టగొడుగులలో యాంటీఆక్సిడెంట్, ఫైటోకెమికల్ లక్షణాలు ఉంటాయి. ఇవి యాంటీ బాక్టీరియల్‌ను యాంటీ ఫంగల్‌గా మారుస్తాయి. దీని కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- పుట్టగొడుగులలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. దీని కారణంగా ఊబకాయం సమస్యలు తగ్గిపోతాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Weight Loss Tips: పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించుకోవడం సులభం.. రోజూ ఇది తాగండి..!
Also Read: Dehydration Symptoms On Skin: శరీరంలో నీరు కొరతగా ఉంటే ఈ చర్మ సమస్యలు తప్పవు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook