Moringa Tea Weight Loss: టీ వల్ల శరీరానికి అంతగా ప్రయోజనాలు ఉండకపోయి. మైండ్‌కి చాలా రిలీఫ్‌ను అందిస్తుంది. అందుకే ఆఫసుల్లో కష్టపడి పని చేసేవారు తరచుగా టీ తాగుతూ ఉంటారు. మరికొంతరైతే బ్లాక్ అండ్ గ్రీన్ టీలు కూడా అతిగా తాగుతున్నారు. అయితే వీటిని అతిగా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధుల వచ్చే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ టీలకు బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించి ఆయుర్వేద గుణాలు కలిగిన కొన్ని టీలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగతాయి. ప్రతి రోజు మునగ టీని తాగితే శరీరానికి అనేక లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ టీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మునగ టీ ప్రయోజనాలు:
బరువు తగ్గడం:
శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలను తగ్గించేందుకు మునగ టీ ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు కార్బోహైడ్రేట్ల పరిమాణాలను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో కేలరీల పరిమాణాలు కూడా తక్కువగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ టీని తాగడం వల్ల శరీరానికి అధిక పరిమాణంలో యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. దీంతో మీరు సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్ కూడా నియంత్రణలో ఉంటుంది.
బ్లడ్ ప్రెజర్ బ్యాలెన్స్:
మునగ టీని ప్రతి రోజు తగడం వల్ల అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారికి ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ హ్యూమన్ హైపర్‌టెన్షన్ అధ్యయనం ప్రకారం..ఈ టీని ప్రతి రోజు తాగితే జీర్ణక్రియ సమస్యలతో పాటు రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు:
మునగ టీలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్‌తో పాటు అనేక రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ టీని తాగడం వల్ల శరీరంలోని మంట తగ్గతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
మొరింగ టీలో యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ టీని ప్రతి రోజు తాగితే వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ టీలో విటమిన్ సి కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి సులభంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.