Monsoon Health Tips: వానా కాలంలో వచ్చే జబ్బులేవైనా.. ఇలా అల్లంతో చెక్‌ పెట్టొచ్చు..!

Health Benefits of Ginger: ప్రస్తుతం భారత్‌లో వానా కాలం మొదలైంది. దీని వల్ల వాతావరణంలో తేమ పెరిగి చాలా మందిలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జలుబు, ప్లూ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2022, 10:24 AM IST
  • వానా కాలంలో వచ్చే వచ్చే జబ్బులేవైనా..
  • అల్లంతో చెక్‌ పెట్టొచ్చు
  • ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది
Monsoon Health Tips: వానా కాలంలో వచ్చే జబ్బులేవైనా.. ఇలా అల్లంతో చెక్‌ పెట్టొచ్చు..!

Health Benefits of Ginger: ప్రస్తుతం భారత్‌లో వానా కాలం మొదలైంది. దీని వల్ల వాతావరణంలో తేమ పెరిగి చాలా మందిలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జలుబు, ప్లూ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇటివలే నివేదిలు పేర్కొన్నాయి. ఈ సమస్యల నుంచి ఇంట్లో లభించే వివిధ రకాల వస్తువులతో ఉపశమనం పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. వానా కాలంలో వచ్చే ఏ వ్యాధులకైనా అల్లం చెక్ పెడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల నుంచి సంరక్షిస్తుంది. అయితే అల్లం నుంచి వచ్చే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం..

వానా కాలంలో వీటికి చెక్‌ పెడుతుంది:

మైగ్రేన్:

 తల నొప్పి (మైగ్రేన్) సమస్యలతో బాధపడుతూ ఉంటే అల్లం టీ ప్రభావవంతంగా పని చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ టీని తాగడం వల్ శరీరంలో ప్రోస్టాగ్లాండిన్‌లు అనేవి తొలగించబడుతాయి. కావును నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

జలుబు, దగ్గు:

వానా కాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో జలుబు, దగ్గు ముఖ్యమైనవి. వీటి నుంచి ఉపశమనం పొందడానికి అల్లంతో చేసి డికాషన్‌ తాగండి. ఈ సమస్యల నుంచి త్వరలోనే ఉపశమనం పొందుతారు.  బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి కలిగిస్తుంది.

ఆర్థరైటిస్:

అల్లంలో ఉండేగుణాలు కీళ్లనొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అల్లంలో ఉండే ఇన్‌ఫ్లమేటరీ, అనాల్జేసిక్ లక్షణాలు ఈ సమస్య నుంచి త్వరగానే ఉపశమనం పొందేట్లు చేస్తాయి.

మధుమేహం:

మధుమేహంతో బాధపడుతున్నవారు అల్లం చేసిన ఆహార పదార్థాలు తింటే శరీరంలోని  రక్తంలో చక్కెరను నియంత్రిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇది ఇన్సులిన్ కార్యకలాపాలను కూడా పెంచుతుందని నిపుణులు పలు పరిశోధనల్లో తేలింది.

బరువు తగ్గడం:

మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఆహారంపై శ్రద్ధ వహించకపోవడం వల్లే ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారని నిపుణలు పేర్కొన్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి అల్లంతో మరిగించిన నీటిని తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read:Kama Reddy Accident: తెలంగాణలో నెత్తురోడిన రోడ్డు..ఆరుగురు అక్కడికక్కడే మృతి..!

Also read:Presidential Election: క్రాస్ ఓటింగ్ వేయలేదు..బద్నాం చేసేందుకే తప్పుడు ప్రచారమన్న సీతక్క..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News