Monsoon Diet: వర్షాకాలంలో చైనీస్ ఫుడ్‌ తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!

Monsoon Diet : వర్షాకాలంలో అందరు వేడి వేడి స్నాక్స్‌ తినేందుకు ఇష్టపడతారు. అయితే చాలా మంది బయట లభించే వివిధ రకాల జంక్‌ ఫుడ్‌ను తింటూ ఉంటారు. ఈ అనారోగ్య కరమైన ఆహారం తినడం వల్ల వానా కాలంలో చాలా రకాల శరీర సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2022, 09:15 AM IST
  • వర్షాకాలంలో చైనీస్ ఫుడ్‌ తింటున్నారా..
  • ఇవి అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతాయి
  • ఫ్రైడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ కూడా తినొద్దు
Monsoon Diet: వర్షాకాలంలో  చైనీస్ ఫుడ్‌ తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!

Monsoon Diet : వర్షాకాలంలో అందరు వేడి వేడి స్నాక్స్‌ తినేందుకు ఇష్టపడతారు. అయితే చాలా మంది బయట లభించే వివిధ రకాల జంక్‌ ఫుడ్‌ను తింటూ ఉంటారు. ఈ అనారోగ్య కరమైన ఆహారం తినడం వల్ల వానా కాలంలో చాలా రకాల శరీర సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. కావున అధిక పోషకాలుండే ఆహారాలను ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎంతో మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిని తినడం వల్ల శరీరం ఆరోగ్య వంతంగా ఉండడమేకాదు. వానా కాలంలో వచ్చే వ్యాధులు కూడా దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే వర్షా కాలంలో ఈ  7 ఆహారాల పట్ల జాగ్రత్త వహించాలని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సముద్ర ఆహారం(Sea food):

సముద్రంలో లభించే చేపలు సాధారణంగా వర్షాకాలంలో సంతానోత్పత్తిని కలిగి ఉంటాయి. కావున  వర్షాకాలంలో వీటిని తినకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చేపలను తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫ్రైడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్(Fried, deep fried food):

వానా కాలం ప్రతి ఒక్కరూ సాయంత్రం ఏదో ఒక స్నాక్‌ తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా టీతో పాటు పకోడీలు తినాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఇలా క్రమం తప్పకుండా తినడం వల్ల ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా  కడుపులో ఉబ్బరం వంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి.

పాల ఉత్పత్తులు (Dairy products):

మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మందిలో జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా మారుతుంది. కాబట్టి వర్షాకాలంలో పాల ఉత్పత్తులను అతిగా తీసుకోకపోవడం మేలని నిపుణులు తెలుపుతున్నారు. వీటిని అతిగా తినడం వల్ల దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రీ-కట్ పండ్లు(Pre-cut fruits):

ఈ సీజన్‌లో తినడానికి ఒక నిమషం ముందే పండ్లను కట్‌ చేసి తినాలని నిపుణులు పేర్కొన్నారు. ఒక వేళా ముందు కట్‌ చేసిన పండ్లను తింటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.

గ్రీన్ వెజిటేబుల్స్(Green vegetables):

ఆకుకూరల్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. కానీ వీటి పట్ల వానా కాలంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పేర్కొన్నారు. వాతావరణంలో తేమ స్థాయిలు పెరగడం వల్ల  వాటిపై సూక్ష్మక్రిములు పెరిగే అవకాశాలుంటాయి. కావున వీటిని వండే క్రమంలో రెండు సార్లు శుభ్రం చేయడం మంచిది.   

స్ట్రీట్ ఫుడ్(Street food):

వర్షాకాలంలో రోడ్డు పక్కన లభించే చైనీస్ ఫుడ్‌ను తినొద్దని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.

Also Read: Boris Johnson: అక్కడ డొనాల్ట్ ట్రంప్.. ఇక్కడ బోరిస్ జాన్సన్! పిచ్చి పనులే కొంప ముంచాయా?

Also Read: Horoscope Today July 8th: నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారిని ఇవాళ నెగటివిటీ వెంటాడుతుంది 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News