Mens Health Tips: మెరుగైన ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ చాలా అవసరం. అందులో కీలకమైంది ఎండు ద్రాక్ష. ముఖ్యంగా మగవారికి సంబంధించిన అనేక సమస్యలకు ఇదే పరిష్కారం. ఎండు ద్రాక్ష ఎలా తినాలి, ఏయే సమస్యలు దూరమౌతాయో తెలుసుకుందాం..
ఎండు ద్రాక్షలో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు,హెల్తీ ఫ్యాట్, ఐరన్, ఫైబర్, కాపర్, పొటాషియం సమృద్ధిగా లభిస్తాయి. పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టే ఎండు ద్రాక్ష తినమని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పురుషులకు సంబంధించిన చాలా సమస్యలకు ఎండు ద్రాక్ష పరిష్కారంగా కన్పిస్తోంది. ఆ ప్రయోజలానాలేంటో చూద్దాం..
స్పెర్మ్ కౌంట్ పెరుగుదల
చెడు లైఫ్‌స్టైల్ ప్రభావం ఎక్కువగా మగవారిపై పడుతుంటుంది. జీవనశైలి సరిగ్గా లేకపోతే స్పెర్మ్ సంఖ్య తగ్గిపోతుంది. ఫలితంగా మేన్ ఇన్‌ఫెర్టిలిటీ సమస్య తలెత్తుతుంది. ఈ విధమైన పరిస్థితి ఉన్నప్పుడు ఎండు ద్రాక్షను డైట్‌లో భాగంగా చేసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి. ఎందుకంటే ఎండుద్రాక్ష..స్పెర్మ్ కౌంట్‌ను గణనీయంగా పెంచుతుంది. అంతేకాకుండా లైంగిక జీవితం కూడా మెరుగుపడుతుంది. ప్రస్తుతం చాలామంది మగవారిలో లైంగిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఫలితంగా వైవాహిక జీవితం పాడైపోతోంది. లైంగిక సమస్యలు దూరం చేసేందుకు కూడా ఎండుద్రాక్ష అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
చాలామందికి శారీరక బలహీనత ఎక్కువగా ఉంటుంది. సామర్ధ్యం లేదా బలం కోసం సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటుంటారు. వివిధ రకాల డైట్ అమలు చేస్తుంటారు. కానీ బలహీనత దూరమయ్యేందుకు అద్భుతమైన మందు ఎండు ద్రాక్షే. రోజూ పాలలో కలుపుకుని ఎండుద్రాక్ష తింటే..బలహీనత దూరమై..బక్కగా ఉన్నవాళ్లు లావౌతారు.
ఎండు ద్రాక్ష ఎలా తినాలి
ఎండు ద్రాక్షలోని మొత్తం అన్ని పోషకాల లాభం పొందాలంటే..పాలలో 10-12 ఎండు ద్రాక్షల్ని వేసి ఉడికించాలి. ఆ తరువాత రాత్రి నిద్రించడానికి గంట ముందు తాగాలి. లేదా రాత్రంతా ఎండు ద్రాక్షను నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలుంటాయి.
Also read: Eating Habits: తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయకండి..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook