మిస్ వరల్డ్ మానుషి ఫిటెనెస్ రహస్యం ఇదే..

మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న భారత సుందరి మానుషి చిల్లర్ ఫిట్ నెస్ రహాస్యాలు ఇవిగో...

Last Updated : Nov 23, 2017, 08:29 PM IST
మిస్ వరల్డ్ మానుషి ఫిటెనెస్ రహస్యం ఇదే..

17ఏళ్ల తరువాత మిస్ వరల్డ్ కిరీటాన్ని భారత్ తరఫున అందుకున్న హర్యానా యువతి మానుషి చిల్లర్..తన ఫిట్ నెస్ రహాస్యాలు వెల్లడించింది. తాను అంత అందంగా, ఫిట్ గా ఉండటానికి కారణం.. తీసుకొనే ఆహారం అని తెలిపింది. 'ఫిట్పాస్' వ్యవస్థాపకురాలు ఆరుషి వర్మ, సెలిబ్రిటీల న్యూట్రిషనిస్ట్ నమామి అగర్వాల్ సలహాలు, సూచనలతో ఫిట్ గా చెప్పుకొచ్చింది. ఫిట్నెస్ ట్రైనర్లు మానుషి ఫిట్నెస్ డైట్ గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు..

* ఉదయం టిఫిన్ తప్పక తీసుకోవాలి. లేకుంటే ఆకలి, ఆహార సమస్యలు వస్తాయి. షుగర్, రిఫైన్ షుగర్ లాంటివి తీసుకోరాదు.

* రెండు లేదా మూడు గ్లాసుల వేడినీళ్లు తాగాలి.

* బ్రేక్ ఫాస్ట్ లో తాజా పండ్లు, రెండు లేదా మూడు గుడ్డు తెల్ల సోన, యోగస్ట్ ఆమ్లెట్, వీట్ ఫ్లెక్స్ తీసుకోవాలి.

* లంచ్ లో అన్నం/చపాతీ తో పాటు ఒక కప్పు కూర/పప్పు/చికెన్ తీసుకోవాలి.

* సాయంత్రం ఉప్పు లేకుండా నట్స్, పండ్లు తీసుకోవాలి.

* డిన్నర్ లో చికెన్/ చేప (రోస్ట్ లేదా గ్రిల్) తో పాటు బ్రకోలి, క్యారెస్ట్, బీన్స్ మరియు ఎదో ఒక కూర తీసుకోవాలి.

Trending News