Black hair: మీ జుట్టు తెల్లబడిపోతుందా..ఈ సహజ పద్ధతులు పాటిస్తే సమస్య నుంచి విముక్తి

White Hair Problem: మీ జుట్టు తరచూ తెల్లబడిపోతుందని బాధపడుతున్నారా.. దైనందిన జీవితంలో స్ట్రెస్ నుంచి దూరం కాలేకపోతున్నారా..మెరిసిపోతున్న జుట్టుకు చిట్కా వైద్యాలు చాలానే ఉన్నాయి. ఇలా చేస్తే జుట్టు మెరిసే సమస్య నుంచి బయటపడవచ్చు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 27, 2021, 11:25 AM IST
Black hair: మీ జుట్టు తెల్లబడిపోతుందా..ఈ సహజ పద్ధతులు పాటిస్తే సమస్య నుంచి విముక్తి

White Hair Problem: మీ జుట్టు తరచూ తెల్లబడిపోతుందని బాధపడుతున్నారా.. దైనందిన జీవితంలో స్ట్రెస్ నుంచి దూరం కాలేకపోతున్నారా..మెరిసిపోతున్న జుట్టుకు చిట్కా వైద్యాలు చాలానే ఉన్నాయి. ఇలా చేస్తే జుట్టు మెరిసే సమస్య నుంచి బయటపడవచ్చు.

జీవితం చాలా బిజీగా (Busy life)మారిపోయింది. ఉద్యోగం, ఇంటి విషయాల్లో సవాళ్ల కారణంగా ఒత్తిళ్లు పెరిగిపోయాయి. టెన్షన్, ఒత్తిళ్ల కారణంగా తక్కువ వయస్సుకే తల మెరిసిపోతుంది. ఎక్కడ విన్నా..ఎక్కడ చూసినా ఇదే సమస్య కన్పిస్తోంది. మందుల ద్వారా కాకుండా సహజ పద్ధతుల ద్వారా జుట్టు నలబడేలా చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఒత్తిడికి (Stress)జుట్టు తెల్లబడటానికి సంబంధముందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒత్తిడి పెరగడమే జుట్టు మెరిసిపోవడానికి కారణమని అంటున్నారు. జుట్టు నల్లబడేందుకు ప్రధాన కారణం మెలనిన్. ఒత్తిడి పెరిగితే శరీరంలో మెలనిన్ (Melonin)ఉత్పత్తి చేసే మూల కణాలు తగ్గిపోతాయి. ఫలితంగా జుట్టు త్వరగా మెరిసిపోతుంటుంది. 

షాంపూలు, కండీషనర్లు మానేసి సహజసిద్ధంగా లభించే శీకాకాయ, కుంకుడు కాయను ఎంత ఎక్కువగా వాడితే అంత మంచిది. ఇండిగో ఆకు చూర్ణాన్ని తరచూ వాడటం వల్ల కూడా జుట్టు  తెల్లబడకుండా(White Hair) ఉంటుంది. మరో పద్ధతి కొబ్బరినూనెలో కాస్త నిమ్మరసం రాసి ఆ మిశ్రమాన్ని రోజూ తలకు రాసుకుంటే ఫలితం ఉంటుంది. నువ్వుల పేస్టులో బాదం నూనెను కలిపి..రోజూ తలకు రాయడం కూడా ఫలితాన్నిస్తుంది. ఉసిరిపొడిలో కాస్త నిమ్మరసం కలుపుకుని తలకు పట్టించి..రెండు గంటల తరువాత స్నానం చేస్తే జుట్టు నల్లబడుతుంది( Black Hair).వీటితోపాటు రోజూ బాదం పప్పు, వాల్నట్ వంటివి కచ్చితంగా తినాలి. పిస్తా కూడా రోజూ తీసుకుంటే మంచిది. 

Also read: Pulse Oximeter: పల్స్ ఆక్సీమీటర్ అంటే ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News