Heart Attack Risk: ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో హార్ట్ ఎటాక్ సమస్య పెరుగుతోంది. మీ బ్లడ్ గ్రూప్‌ని బట్టి మీలో హార్ట్ ఎటాక్ రిస్క్ ఎంతవరకూ ఉంటుందో తెలుసుకోవచ్చు. ఆ గ్రూప్ అయితే మాత్రం..
హార్ట్ ఎటాక్. మనిషిని అత్యంత భయపెట్టే వ్యాధి. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ప్రమాదం. హార్ట్ ఎటాక్ ముప్పు అనేది సహజంగా అస్తవ్యస్థమైన లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా వస్తుంటుంది. మారుతున్న జీవనశైలితో పాటు సాధారణంగా ఆరోగ్యంపై దృష్టి పెట్టరు. ఫలితంగా తక్కువ వయస్సులోనే గుండెపోటుకు గురవుతుంటారు. గుండెపోటుతో ప్రాణాలు పోయే పరిస్థితులు చాలా ఎక్కువ. ఈ నేపధ్యంలో ఏయే బ్లడ్ గ్రూప్స్ వారికి గుండెపోటు సమస్య ఎంతవరకూ ఉంటుందో తెలుసుకుందాం..ఏ బ్లడ్ గ్రూప్ వారికి గుండెపోటు సమస్య తక్కువనేది కూడా చూద్దాం..
ఏ, బీ గ్రూపులకు హార్ట్ ఎటాక్ ముప్పు ఎక్కువే
దీనిపై చాలా అధ్యయనాలే జరిగాయి. ఆ అధ్యయనాల ప్రకారం ఏ, బీ బ్లడ్ గ్రూపువారికి థ్రోంబోసిస్ అయ్యే ప్రమాదం ఎక్కువ. థ్రోంబోసిస్ అంటే రక్తనాళాలు లేదా ధమనులు కుదించుకుపోయే స్థితి. ఫలితంగా రక్తాన్ని సరఫరా చేసేందుకు గుండెపై ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా చాలా రకాల సమస్యలు ఎదురౌతాయి.
ఓ బ్లడ్ గ్రూప్ పరిస్థితి ఏంటి
ఇక మరో ముఖ్యమైనది, యూనివర్శల్ బ్లడ్ డోనర్‌గా పిలువబడే ఓ గ్రూప్. ఈ గ్రూప్ వారికి గుండెపోటు ముప్పు చాలా తక్కువ. అయితే ఇదేమీ నిర్ధారణ కాలేదు. అయితే ఈ గ్రూప్ ప్రజానీకం తమ ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే మారుతున్న జీవనశైలిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతూ..హార్ట్ ఎటాక్ ముప్పును తెచ్చిపెడుతున్నాయి.
మార్చుకోవల్సిన అలవాట్లు
అన్నింటికంటే ముఖ్యమైంది సమయానికి నిద్రపోవడం, సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ అలవాటు చాలా రుగ్మతలకు కారణం. దీంతోపాటు మీ ఆహారపు అలవాట్లపై కూడా దృష్టి సారించాలి. హార్ట్ ఎటాక్ రిస్క్‌ను తగ్గించే పండ్లు, కూరగాయల్ని సాధ్యమైనంతవరకూ డైట్లో చేర్చుకుంటే మంచిది.
Also read: Male Infertility: కొత్తగా పెళ్లయిన మగవారు అర్ధరాత్రి వరకు స్మార్ట్ ఫోన్ వాడకండి.. ఎందుకంటే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook