Knee Pain Remedies: వయసు పెరిగే కొద్దీ చాలామందిలో కీళ్ల నొప్పుల సమస్య ఎదురవుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు ఆర్థరైటిస్‌లో అత్యంత సాధారణ సమస్యలు. వీటి బారిన పడిన చాలా మందికి కీళ్ల నొప్పులు విపరీతంగా పెరిగిపోతాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని ఆహర నియమాలను పాటించడం వల్ల కీళ్ల నొప్పులకు స్వస్తి చెప్పవచ్చని వైద్యులు అంటున్నారు. ఇంతకీ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.
నారింజ పండుతో మేలు..
ఆరెంజ్ పండు ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. ఈ పండు తినడం వల్ల కీళ్ల నొప్పులు, వాపు సమస్యలు తగ్గుతాయి. నారింజలో విటమిన్- సి తో సమృద్ధిగా ఉంటుంది. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఈ పండులో ఉండడం వల్ల కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.
పుచ్చకాయతో కూడా..
ఆరెంజ్ తో పాటు పుచ్చకాయ తినడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తోంది. పుచ్చకాయలోనూ యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు, కెరోటినాయిడ్ బీటా - క్రిప్టోసంతిన్ కూడా ఉండడం వల్ల ఎముకలకు మేలు చేస్తాయి. పుచ్చకాయ తినడం వల్ల మోకాలి వాపులు తగ్గేందుకు అవకాశం ఉంది.
ద్రాక్షపండుతో ఉపశమనం
ఆరెంజ్, పుచ్చకాయతో పాటు ద్రాక్ష ను కూడా రోజూ తినడం వల్ల మీ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. దీన్ని తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కీళ్ల నొప్పులు కూడా క్రమంగా తగ్గుతాయి. ద్రాక్షపండులోని రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఆర్థరైటిస్ ఉన్న రోగులకు ఉపశమనం లభిస్తోంది.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. ఈ చిట్కాలను పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)
Also Read: Pomegranate Benefits: దానిమ్మ విత్తనాలు లేదా జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
Also Read: Glowing Skin Tips: వేసవిలోనూ కాంతివంతమైన చర్మసౌందర్యం కోసం ఈ టిప్స్ పాటించండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.