Joint Pain Remedies: చలి కారణంగా తీవ్ర మోకాళ్ళ, కీళ్ళ నొప్పుల సమస్యలు వస్తున్నాయా? ఈ రెండు ఆసనాలను వేయండి చాలు..

Knee And Joint Pain Remedies: ప్రతిరోజు ఈ రెండు ఆసనాలను వెయ్యడం వల్ల మోకాలు కీళ్ల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరాన్ని కూడా తగినంత విశ్రాంతి లభిస్తుందని వారంటున్నారు. అయితే ఏయే ఆసనాలు శరీరానికి మంచి ప్రయోజనాలను కలిగిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2023, 01:10 PM IST
Joint Pain Remedies: చలి కారణంగా తీవ్ర మోకాళ్ళ, కీళ్ళ నొప్పుల సమస్యలు వస్తున్నాయా? ఈ రెండు ఆసనాలను వేయండి చాలు..

 

Yoga For Knee And Joint Pain: వయసుతో సంబంధం లేకుండా చాలామంది కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు సమస్యల బారిన పడుతున్నారు. వాతావరణం లో తేమ పెరగడం కారణంగా ఈ సమస్యలు రెట్టింపు అవుతూ ఉంటాయి. అంతేకాకుండా నొప్పుల తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు చలికాలంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో కండరాలను బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం. 

మోకాళ్ళ నొప్పులు, కీళ్లనొప్పులతో బాధపడేవారు తప్పకుండా ఈ సమయంలో ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా అతిగా నూనె ఉండే పదార్థాలను ఈ సమయాల్లో తినడం మానుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తప్పకుండా కొన్ని ప్రత్యేక యోగాసనాలు చేయాల్సి ఉంటుంది. వీటిని చేయడం వల్ల మోకాళ్లలోని రక్తప్రసరణ పెరిగి నొప్పుల నుంచి సులభంగా లభిస్తుంది.

త్రికోణాసనం:
ప్రతిరోజు త్రికోణాసనం చేయడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కండరాలు కూడా బలోపేతం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ఆసనం చేయడానికి ముందుగా నిటారుగా నిలబడి ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ కాళ్ళ మధ్యలో సుమారు రెండు అడుగుల దూరాన్ని ఉంచి.. దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎడమ చేతిని పైకి కదుపుతూ వేళ్లను మీ కళ్ళను దాకాల్సి ఉంటుంది. ఆ తర్వాత సాధారణ స్థితిలోకి రావాల్సి ఉంటుంది. ఇలా ప్రతిరోజు 20 నిమిషాల పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

గరుడాసనం:
ప్రతిరోజు గురుడాసనాన్ని వేయడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరానికి తగిన విశ్రాంతి కూడా లభిస్తుంది. అయితే ఈ ఆసనాన్ని చేయడానికి ముందుగా నేలపై నిటారుగా నిలబడి ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత కుడి మోకాలని వంచి.. మీ ఎడమ పాదం మీద నిలబడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కుడి పాదాన్ని ఎడమవైపు ముందుకి, వెనకకి కదులుతూ ఉండాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కుడి తొడలను ఎడమ వైపుకు కుడివైపుకు కదిలించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండు చేతులను ముందుకు వెనుకకు తీసుకు వెళ్తూ మోచేతులను మంచి క్రాస్ చేయాలి. ఇలా ప్రతిరోజు 10 నిమిషాల పాటు చేయడం వల్ల శరీరానికి తగిన విశ్రాంతి లభిస్తుంది. అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులు కూడా సులభంగా దూరమవుతాయి.

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News