Kidney Damage Prevention Tips: ఈ నియమాలతో ఎంతటి కిడ్నీ సమస్యలైనా చెక్‌..కాబట్టి మీరు పాటించాల్సిందే..

Kidney Damage Prevention Tips: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటించడం అవసరం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2022, 06:24 PM IST
Kidney Damage Prevention Tips: ఈ నియమాలతో ఎంతటి కిడ్నీ సమస్యలైనా చెక్‌..కాబట్టి మీరు పాటించాల్సిందే..

Kidney Damage Prevention Tips: ప్రస్తుతం చాలామంది చిన్న వయసులోనే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవన శైలి కాకుండా తప్పుడు ఆహారపు అలవాట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరిలో కిడ్నీ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు మద్యపానం, ధూమపానమేనని వారి తెలుపుతున్నారు. అయితే ఈ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సింది. లేకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

శరీర సామర్థ్యం తగ్గిపోవడం:
కిడ్నీల బలహీనత వల్ల చాలామందిలో శరీర సామర్థ్యం తగ్గిపోతుందని వేదికలు పేర్కొన్నాయి. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా సకాలంలో వైద్యులను సంప్రదించి చికిత్స పొందడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఆరోగ్యవంతమైన కిడ్నీల కోసం ఇలా చేయండి:
జీవనశైలిలో మార్పులు:

కిడ్నీలో ఆరోగ్యంగా ఉండేందుకు తప్పకుండా జీవన శైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధునిక జీవనశైలిని అనుసరిస్తున్న వారు తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అంతేకాకుండా శరీరాన్ని యాక్టివ్గా ఉంచుకునేందుకు తప్పకుండా సరైన సమయాల్లో నిద్రపోవడం, తినడం, మేలుకోవడం దినచర్యలో భాగంగా చేసుకోవాల్సి ఉంటుంది.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు పెయిన్ కిల్లర్స్ ను అతిగా వినియోగించకూడదా..?
కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు చాలామంది మార్కెట్లో లభించే పెయిన్ కిల్లర్స్ ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. అందులో ఉండే రసాయనాలు శరీరంలోని ఇతర భాగాలను కూడా కలుషితం చేసి తీవ్ర అనారోగ్య సమస్యలకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని కిడ్నీలలో నొప్పులు, శరీర నొప్పులు ఉన్నవారు సహజంగానే ఉపసనం పొందడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ధూమపానానికి దూరంగా ఉండండి:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది చిన్న వయసులోనే ధూమపానం వంటి చెడు వ్యసనాలకు గురవుతున్నారు. దీనివల్ల తీవ్ర అనారోగ్య సమస్యల దారిన పడి జీవితాన్ని కోల్పోతున్నారు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు ధూమపానాన్ని చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు గురయ్యా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొందరిలో ప్రాణాంతకంగా మారే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటమే చాలా మంచిది.

Also Read: LIC Scheme: వృద్ధాప్యంలో ఖర్చుల టెన్షన్.. ఈ పాలసీ తీసుకుంటే ప్రతి నెలా పెన్షన్  

Also Read: LIC Scheme: వృద్ధాప్యంలో ఖర్చుల టెన్షన్.. ఈ పాలసీ తీసుకుంటే ప్రతి నెలా పెన్షన్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News