Kidney Affecting Food: కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎట్టిపరిస్థితిలోనూ వీటిని తినకూడదు!

Kidney Affecting Food: మన శరీరంలో మూత్రపిండాలు అతి ముఖ్యమైనవని అందిరికీ తెలిసిందే. ఇవి మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలను అతిగా తినడం వల్ల కిడ్నీల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2022, 03:31 PM IST
Kidney Affecting Food: కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎట్టిపరిస్థితిలోనూ వీటిని తినకూడదు!

Kidney Affecting Food: మానవ శరీరంలో మూత్రపిండాలు (కిడ్నీలు) ఎంతో ముఖ్యమైన అవయవం. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి తోడ్పతాయి. మూత్రాన్ని ఉత్పత్తి చేయడం సహా రక్తపోటును నియంత్రించే హర్మోన్లను స్రవిస్తాయి. ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు అబ్రార్ ముల్తానీ ప్రకారం.. కిడ్నీలను నేరుగా దెబ్బతీసే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అలాంటి వాటి వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ స్టోన్, కిడ్నీ క్యాన్సర్ వంటి సమస్యలను ఏర్పడే ప్రమాదం ఉంది. 

మూత్రపిండాల పనితీరు ఏమిటి?

మూత్రపిండాలు శరీరంలోని వ్యర్థాలను మూత్రం ద్వారా విసర్జిస్తాయి. కిడ్నీ సమస్యను తొలిదశలోనే గుర్తిస్తే డైట్ ద్వారా సరిదిద్దుకోవచ్చు. అయితే చివరి దశలో సమస్య గుర్తిస్తే డయాలసిస్ ఒక్కటే పరిష్కారం.

మూత్రపిండాల వైఫల్యానికి సంబంధించిన ప్రారంభ సంకేతాలు
- అనోరెక్సియా
- శరీరంలో వాపు
- ఎక్కువగా చలి పుట్టడం
- సోరియాసిస్
- మూత్ర విసర్జన సమస్యలు
- చికాకు

మూత్రపిండాలను ప్రభావితం చేసే 5 ఆహార పదార్థాలు

1. మద్యం

అతిగా మద్యం సేవించడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. మితిమీరిన ఆల్కహాల్ వినియోగం మూత్రపిండాల పనితీరుతో సమస్యలను కలిగిస్తుంది. ఇది మీ మెదడుపై ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ సేవించడం వల్ల కిడ్నీలపై చెడు ప్రభావాన్ని చూపడమే కాకుండా.. ఇతర అవయవాలకు కూడా హాని కలిగిస్తుంది.

2. ఉప్పు

ఉప్పులో సోడియం లేదా పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలో సరైన మొత్తంలో ద్రవాన్ని నిర్వహిస్తుంది. అయితే ఉప్పును ఆహారంలో తీసుకుంటే అది అధిక ఒత్తిడి, మూత్రపిండాలకు హాని కలిగించే ద్రవం మొత్తాన్ని పెంచుతుంది.

3. పాల ఉత్పత్తులు

పాలు, చీజ్, వెన్న వంటి పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం మూత్రపిండాలకు మంచిది కాదు. పాల ఉత్పత్తుల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీలను దెబ్బతీస్తాయి. పాల ఉత్పత్తులలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. కాబట్టి, వాటిని ఎక్కువగా తీసుకోవడం మానుకుంటే మంచిది. 

4. అతిగా మాంసాహారం

మాంసాహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. అలాంటి క్రమంలో మాంసాన్ని జీర్ణం చేయడం మన శరీరానికి కష్టమవుతుంది.

5. కృత్రిమ స్వీటెనర్

మార్కెట్‌లో లభించే స్వీట్లు, కుకీలు, పానీయాలలో కృత్రిమ తీపి పదార్ధాలు విరివిగా ఉపయోగిస్తారు. ఇవి కిడ్నీల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)        

Also Read: Anger Management: మీకు పట్టరాని కోపం వచ్చినప్పుడు ఈ టిప్స్ పాటిస్తే టెన్షన్ పెరగదు!

Also Read: Dark chocolate Benefits: డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మేలు చేస్తుందా? కీడును కలిగిస్తుందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News