Joint Pains: కీళ్ల నొప్పులు పెంచే ఆహారాలివే.. జర ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..

Food Causes Joint Pains: కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి ఆహారపదార్థలు తీసుకోకుండా ఉండాలి అనేది తెలుసుకుందాం.   

Written by - Shashi Maheshwarapu | Last Updated : Oct 8, 2024, 05:26 PM IST
Joint Pains: కీళ్ల నొప్పులు పెంచే ఆహారాలివే.. జర ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..

Food Causes Joint Pains: ఆధునిక జీవనశైలిలో మారిన మార్పుల కారణంగా చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, వీపు నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నప్పుడు మందులు, చికిత్సలు తీసుకుంటారు. కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీని కారణం మన ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను తీసుకోవడమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  మనం ప్రతిరోజు తీసుకొనే ఆహారంలో కొన్ని పదార్థాలు తినడం వల్ల కీళ్ల నొప్పులు మరింత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల కీళ్ల సమస్యలు పెరుగుతాయి అనేది తెలుసుకుందాం. 

కీళ్ల నొప్పులను పెంచే ఆహారాలు:

రెడ్‌ మీట్‌: 

ఎరుపు మాంసంలో  ప్యూరిన్స్ అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీని అధికంగా తినడం వల్ల కీళ్ల నొప్పులు, నడుము నొప్పి కలుగుతాయి. ఇవి శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ ను పెంచుతుంది. అంతేకాకుండా గౌట్ అనే వ్యాధికి దారి తీస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

సీ ఫుడ్స్‌: 

చాలా మంది చేపలు, రొయ్యలు అధికంగా తింటారు. ఇందులో కూడా ప్యూరిన్స్‌ అధికంగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో తీవ్రమైన నొప్పులు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటిని మితంగా తీసుకోవడం చాలా మంచిది.

పిండి పదార్థాలు: 

చాలా మంది పిండి పదార్థాలు తింటారు. ఇందులో బియ్యం, గోధుమలు ఎక్కువగా ఉంటాయి. ఇది గ్లూటెన్‌ను విడుదల చేస్తుంది. ఈ పదార్థం కొందరిలో అలర్జీలను కలగిస్తుంది. కీళ్ల నొప్పులను పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. 

షుగర్‌: 

షుగర్ అధికంగా తినడం వల్ల కీళ్ల నొప్పులు తీవ్రంగా కలుగుతాయి. కాబట్టి షుగర్ తక్కువగా తీసుకోవడం చాలా మంచిది. కీళ్ల నొప్పులు మాత్రమే కాకుండా డయాబెటిస్‌ కు కూడా దారి తీస్తుంది. 

సోయా: 

సోయా ఆరోగ్యానికి మంచి ఆహారం అయినప్పటికి కొంతమంది దీని తినడం వల్ల అలర్జీని కలిగిస్తుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పులను పెంచుతుంది. సోయా తిన్న తరువాత కీళ్ల నొప్పలు కలుగుతే వెంటనే ఉపయోగించడం మానేయండి. 

కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఏం తినాలి?

కీళ్ల నొప్పులతో బాధపడకుండా ఉండాలంటే ప్రతిరోజు ఆహారంలో పండ్లు, కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌లు, విటమిన్‌లు పుష్కలంగా దొరుకుతాయి. ఇవి శరీరంలో వాపును, నొప్పులను తగ్గిస్తుంది.  చక్కెర తక్కువగా ఉండే పాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. వీటితో పాటు బాదం, వాల్‌నట్స్ వంటి జీర్ణమయ్యే గింజలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు విటమిన్ K అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం మాత్రమే. ఏదైనా ఆహారం తీసుకునే ముందు మీ వైద్యునిని సంప్రదించడం మంచిది.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News