Joint Pain: కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ ఆహారాలు తింటే అంతే సంగతి..ఎందుకంటే..

Knee Pain Remedies: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు శీతాకాలంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే నొప్పులు మరింత తీవ్ర తరమయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2023, 11:24 PM IST
Joint Pain: కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ ఆహారాలు తింటే అంతే సంగతి..ఎందుకంటే..

 

Joint Pain Remedies: ప్రస్తుత కాలంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా తరుచుగా కీళ్ల నొప్పుల సమస్యల బారిన పడుతున్నారు. కీళ్ల నొప్పుల కారణంగా తమ పనుల చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు తీసుకునే అనారోగ్యకరమైన ఆహారాలేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రత పెరగడం కారణంగా మీలో కీళ్ల నొప్పులు వస్తున్నాయా? ఇక నుంచి ఆందోళన పడన్నకర్లేదు. ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు వినియోగించి ఈ సమస్యలకు సులభంగా చెక్‌ పెట్టొచ్చు. 

సాధారణంగా మనం శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ చేరడం వల్ల ఈ కీళ్ల నొప్పుల సమస్యలు ప్రారంభం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ లెవల్స్‌ పెరిగితే కీళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యలు, గుండెపోటు వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారి తీసే ఛాన్స్‌లు ఉన్నాయి. కీళ్ల నొప్పులు రావడానికి ముందు యూరిక్‌ యాసిడ్‌ అనేది కీళ్ల చుట్టు చేరుతుంది. దీని కారణంగానే చాలా మందిలో కీళ్ల నొప్పులు వస్తున్నాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో తరచుగా తీసుకునే అనారోగ్యకరమై ఆహార పదర్ధాల వల్ల  యూరిక్ యాసిడ్ లెవల్స్‌ పెరుగుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో ఆహారాలు తీసుకునే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

బీట్‌రూట్:
చలి కాలంలో యూరిక్‌ యాసిడ్‌ లెవస్స్‌ను పెంచే కూరగాయిలో బీట్‌రూట్ ఒకటి. శీతాకాలంలో దీనితో తయారు చేసిన ఆహారాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా మంది కీళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. కాబట్టి ఇప్పటికే కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు బీట్‌రూట్‌ను తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

స్వీట్స్:
శీతాకాలంలో తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల కూడా శరీరంలో సులభంగా యూరిక్‌ యాసిడ్‌ లెవల్స్‌ పెరుగుతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, మధుమేహం ఉన్నవారు చలి కాలంలో తీపి పదార్థాలు తినడం మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఛాన్స్లు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

డేట్స్:
ఖర్జూరంలో తక్కువ పరిమాణంలో ప్యూరిన్ ఉంటుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు వీటిని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా శీతాకాలంలో తరచుగా ఖర్జూరాను తీసుకోవడం వల్ల షుగర్‌ లెవల్స్‌ పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News