Ayurvedic Remedy For Joint Pain In Telugu: చలి తీవ్రత కారణంగా కొంతమందిలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా వయస్సు మళ్ళిన వారిలో కీళ్ల నొప్పులతో పాటు మోకాళ్ళ నొప్పులు నడుము వేళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. వాతావరణంలోని వాయువు పెరగడం కారణంగానే ఇలాంటి నొప్పులు వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా ప్రస్తుతం యువతలో కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ కీళ్ల నొప్పుల సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా కొన్నింటికి దూరంగా ఉండడం చాలా మంచిది.
ఒత్తిడి తగ్గించుకోండి:
శీతాకాలంలో కీళ్ల నొప్పులతో పాటు మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణం కొంతమందిలో ఒత్తిడి పెరగడమేనని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ నొప్పులతో బాధపడుతున్న వారు తప్పకుండా మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో మెడిటేషన్ చేయడం వల్ల కూడా మంచి లాభాలు పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు.
నిద్ర చాలా ముఖ్యం:
కీళ్ల నొప్పులు ఉన్నవారు తప్పకుండా రాత్రిపూట తగిన మోతాదులో నిద్రపోవడం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది రాత్రిపూట ఐదు నుంచి ఆరు గంటల పాటు నిద్రపోతున్నారు. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఇలా చేస్తే నొప్పులు మరింత తీవ్రతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం చాలా మంచిది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
విశ్రాంతి చాలా అవసరం:
కొంతమంది కీళ్ల నొప్పులతో బాధపడేవారు కంటిన్యూగా పనిచేస్తూ ఉంటారు. దీని కారణంగా శీతాకాలంలో కీళ్ల నొప్పులు మరింత పెరగడమే కాకుండా శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ నొప్పులతో బాధపడుతున్న వారు తప్పకుండా శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి:
శీతాకాలంలో కీళ్ల నొప్పులు ఉన్నవారు తప్పకుండా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆహారాలు కీళ్లపై ప్రభావం చూపి నొప్పులను మరింత తీవ్రతరం చేసే అవకాశాలున్నాయి. కాబట్టి కీళ్ల నొప్పులు ఉన్నవారు బఠనీలు, బంగాళదుంప, టమాటో, తేనె కలిగిన ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిది. అంతేకాకుండా శీతాకాలం మొత్తం వీటికి దూరంగా ఉండడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter