Liver Safeguarding Tips: శరీరం ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లను కలిగి ఉండటం చాలా ముఖ్యం. కాలేయం మన శరీరంలో ఒక ప్రత్యేక భాగం. ఈ రోజుల్లో చాలా మంది కాలేయానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాలేయాన్ని ఏయే అంశాలు దెబ్బతీస్తాయో తెలుసుకుందాం.
1. ఆల్కహాల్..
ఈరోజుల్లో చాలా మందిలో కాలేయ సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. కాలేయం పాడవడానికి ప్రధాన కారణం మనం రోజూ తినే కొన్ని ఆహార పదార్థాలు. ఆ జాబితాలో మొదటగా వచ్చేది ఆల్కాహాల్. మీరు చాలావరకు మద్యం సేవించకుండా ఉండటం మంచిది. దీని ప్రభావం కూడా లివర్ చాలా ఎక్కువగా ఉంటుంది.
2. షుగర్..
మనలో చాలా మంది చక్కెర తినడానికి చాలా ఇష్టపడతారు. మీకు తెలుసా? చక్కెర కాలేయంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ప్రతిరోజూ చక్కెరను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి లేదా అస్సలు తీసుకోకూడదు. మీరు క్యాండీలు, కుకీలు ,సోడాలకు సంబంధించిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి.
౩. ఫాస్ట్ ఫుడ్..
పెద్దలకే కాదు ఈకాలంలో పిల్లలు కూడా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. ప్రతిరోజూ బయట నుండి తినడానికి ఇష్టపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ ఇందులో వాడే ఆహారపదార్థాల వల్ల ఈ ఫుడ్స్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.
Also read: Sugar Spike Foods: ఈ 5 డయాబెటిక్ రోగులకు విషం.. తిన్నవెంటనే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయట.. !
4.రెడ్ మీట్..
సాధ్యమైనంత వరకు రెడ్ మీట్‌కు దూరంగా ఉండాలి. ఇవి ముఖ్యంగా బరువును చాలా వరకు పెంచుతాయి. రెడ్ మీట్ తినకుండా ఉండటం బెట్టర్. దీని వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధులు గణనీయంగా పెరుగుతాయి.ఈ కాలంలో ఈ అనారోగ్య సమస్య విపరీతంగా పెరుగుతోంది.
5. వైట్ ఫుడ్..
మీరు తక్కువ పరిమాణంలో వైట్ ఫుడ్స్ తినాలి. ఇది పలువిధాలుగా ప్రాసెస్ చేసిన ఆహారం. ఇది శరీరానికి హాని చేస్తుంది. ఈ జాబితాలో పిజ్జా, పాస్తాలు వంటివి వస్తాయి. కాబట్టి వీటిని మనం తినడం మానుకోవాలి.
Also read: Pregnancy Tips: గర్భిణీ స్త్రీలకు మొదటి 3 నెలలు ఎందుకు చాలా ప్రత్యేకం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter