Women Health: ఈ ఆహారం అలవాట్లు ఉంటే..మహిళలకు గుండె వ్యాధులు తప్పవు..!!

Women Health: మనవ శరీరానికి ఆహార పదార్థాలు మంచి లాభాలు ఇస్తాయి..అయితే మరి కొన్నిఆహార పదార్థాలు నష్టాలను కలిగిస్తాయి. అందుకే వైద్యనిపుణులు శరీరానికి హాని కల్గించే ఆహారం తినొద్దని సూచిస్తారు. మానవులు ఆరోగ్యంగా ఉండేందుకు చాలా రకాల ఆహారపదార్థాలున్నాయి. అంతే పెద్ద మొత్తంలో శరీరానికి హాని కలిగించే ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 01:37 PM IST
  • కొవ్వు ఉన్న పెరుగు మహిళలకు ఎంతో మేలు
  • వైట్ బ్రెడ్ మహిళల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది
  • మహిళల గుండె వ్యాధులకు ఈ ఆహారపు అలవాట్లే కారణం
Women Health: ఈ ఆహారం అలవాట్లు ఉంటే..మహిళలకు గుండె వ్యాధులు తప్పవు..!!

Women Health: మనవ శరీరానికి ఆహార పదార్థాలు మంచి లాభాలు ఇస్తాయి..అయితే మరి కొన్నిఆహార పదార్థాలు నష్టాలను కలిగిస్తాయి. అందుకే వైద్యనిపుణులు శరీరానికి హాని కల్గించే ఆహారం తినొద్దని సూచిస్తారు. మానవులు ఆరోగ్యంగా ఉండేందుకు చాలా రకాల ఆహారపదార్థాలున్నాయి. అంతే పెద్ద మొత్తంలో శరీరానికి హాని కలిగించే ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. పెరుగుతున్న కలుష్యం దృష్ట్యా మహిళలు వారు తీసుకునే ఆహారం పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు తెలిపారు. స్త్రీలు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదని సలహా ఇస్తున్నారు. తినకూడని ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. కొవ్వు లేని పెరుగు

పెరుగు అన్నం తినడానికి అందరూ ఇష్టపడతారు. కానీ పలువురు నిపుణులు కొవ్వు లేకుండా పెరుగు తినకూడదని సలహా ఇస్తున్నారు. మార్కెట్‌లోని నాన్‌ఫ్యాట్ పెరుగులో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి, ఇన్సులిన్ పెరుగుతుంది. హ్యూమన్ రిప్రొడక్షన్ జర్నల్‌లో తెలిపిన అధ్యయనం ప్రకారం.. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను అధిక మొత్తంలో తినే స్త్రీలలో అండోత్సర్గనికి 85 శాతం ఎక్కువ ప్రమాదం ఉందని.. పూర్తి కొవ్వు ఉన్న పెరుగును తీసుకోవడం మంచిదని వెల్లడించింది.

2. వైట్ బ్రెడ్

వైట్ బ్రెడ్ ప్రస్తుతం స్నాక్స్‌లో చాలా వినియోగిస్తున్నారు. ఈ బ్రెడ్‌ తయారీలో శుద్ధి చేసిన పిండి పదార్థాలు వాడతారు.  వీటి వల్ల ఆ బ్రెడ్‌లో ఫైబర్ అస్సలు ఉండదు. ఇటువంటి పిండి పదార్థాలు రక్తంలో చక్కెరను పెంచడమే కాకుండా, ఇన్సులిన్ స్థాయిని కూడా పెంచుతాయి. ఇది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, PCOSతో బాధపడుతున్న మహిళలకు పెద్ద ముప్పును తెచ్చిపెడుతుంది.

3. సోడా

సోడాలో కేలరీలు తక్కువగా ఉండడమే కాకుండా అందులో రసాయనాలు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అమెరికన్ జెరియాట్రిక్స్ సొసైటీ జర్నల్‌లో తెలిపిన వివరాల ప్రకారం... క్రమం తప్పకుండా సోడా తాగే వ్యక్తులు,  సోడా తాగని వారి కంటే 3 రేట్లు ఎక్కువ కొవ్వును కలిగి ఉన్నారు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని తెలిపింది.

4. పండ్ల రసం

ఫ్రూట్ జ్యూస్ ఓ హెల్తీ డ్రింక్‌.. ఈ డ్రింక్‌ ఆరోగ్యకరమే కానీ ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కావున ఈ పండ్ల రసం వల్ల స్త్రీలకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం నలుగురు మహిళల్లో ఒకరు గుండె సంబంధిత వ్యాధితో మరణిస్తున్నారు. కావున  మహిళలు చెక్కర శాతం అధికంగా ఉన్న ఫ్రూట్ జ్యూస్‌ను తాగడం మానుకోవాలి. అంతే కాకుండా శరీరంలో మంటను పెంచడం..గుండె వాపు సమస్యలను కలిగిస్తుంది. పండ్ల రసానికి బదులు మొత్తం పండ్లను తింటే బాగుంటుందని నిపుణులు తెలుపుతున్నారు.

5. కాఫీ క్రీమ్‌

కాఫీలో రుచిని పెంచేందుకు దానిపై ఓ తెల్లని క్రీమ్ వేస్తారు. ఆ క్రీమ్‌లో ఓ రకమైన  ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది మహిళల  గుండెకు హాని కలిగించడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది. కావున మహిళలు  కాఫీకి దూరంగా ఉండటం మేలు.

6. మద్యం

ప్రస్తుతం మద్యాన్ని చిన్న పెద్ద, స్త్రీ, పురుషులు తేడా లేకుండా అందరు సేవిస్తున్నారు. అయితే మహిళలు మద్యం తీసుకుంటే వచ్చే సమస్యలపై ఎపిడెమియాలజీ జర్నల్‌ పరిశోధన చేసింది. జర్నల్‌ పరిశోధన  వివరాల ప్రకారం.. ఆల్కహాల్ తీసుకునే స్త్రీలు.. మద్యపానం సేవించని మహిళల కంటే 50 శాతం ఎక్కువ అనారోగ్యానికి గురవుతారని, కాబట్టి వీలైనంత వరకు మద్యపానానికి దూరంగా ఉండండటం మేలని వెల్లడించింది.

Also Read: Acharya Movie Trolls: ఆచార్య మూవీపై ట్విట్టర్ లో ఘోరమైన ట్రోలింగ్.. అసలు ఏమైంది?

Also Read: Bank Holidays in May 2022: బ్యాంకు కస్టమర్లకు గమనిక.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News