Covid-19 Second Wave Tips | ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ సెకండ్ వేవ్ మొదలైంది. అనేక దేశాల్లో మళ్లీ కేసులు ఎక్కువ అయ్యాయి. భారత దేశంలో కూడా దాని ప్రభావం కనిపిస్తోంది. ఢిల్లీ, గుజరాత్, అస్సోంలో కేసులు నిత్యం పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పెరగకుండా ఉండాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కోవిడ్-19 సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలి అనుకుంటే ఈ చిట్కాలు పాటించండి
Also Read | Marriage Muhurat: నవంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 వరకు వివాహ, శుభ ముహూర్తాలు
1. మాస్కులు ధరించండి (Wear Mask )
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి మొదలైన నాటి నుంచి చాలా మంది మాస్కు ధరించారు. కానీ మధ్యలో మానేశారు. అలాంటి వారు వెంటనే అలెర్ట్ అయి మాస్కు ధరించడం మొదలు పెట్టాలి. కోవిడ్-19 సంక్రమణ పెరగకుండా మాస్కు ధరించాలి. ఈ సమయంలో 50-80 శాత మంది మాస్కు ధరించినా సెకండ్ వేవ్ నుంచి బయటపడవచ్చు.
2. భౌతిక దూరం (Social Distancing )
ఇంటి నుంచి బయటికి వచ్చిన సమయంలో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ఇలా చేయడం వల్ల కమ్యూనిటీ లో వైరస్ వ్యాప్తి అవ్వకుండా చూసుకోవచ్చు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కనీసం 6 అడుగలు దూరం పాటించండి.
Also Read | గాల్లో తేలినట్టుందే.. Double Decker Train వచ్చేసిందే
3. గుంపులో తిరగకండి ( Avoid Groups )
ఒక గుంపులో ఎవరికి కరోనా వైరస్ ఉందో..ఎవరికి లక్షణాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే గుంపులోకి వెళ్లకండి. వీలైనంత వరకు మనుషుల నుంచి దూరంగా ఉండండి. వింతగా అనిపించినా ఇది తప్పదు మరి.
4.ఇండోర్ లో కలవకండి ( Dont Meet Indoors)
ఎవరినైనా కలవాలి అనుకుంటే వారిని మీ ఇంటికి పిలవకండి. ఒకరి ఇంటికి వెళ్లకంది. జిమ్ ( Gym ), బార్, రెస్టారెంట్ లో కూడా వీలైనంత తక్కువగా కలవండి. వెంటిలేషన్ సరిగ్గా లేని చోట సమావేశాలు అస్సలు పెట్టుకోకండి.
Also Read | TRS Manifesto: టీఆర్ఎస్ హెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల, కీలక అంశాలివే
5. చేతులు శుభ్రంగా కడుక్కోండి ( Wash Your Hands )
కరోనావైరస్ వ్యాపించకుండా ఇది నిరోధిస్తుంది. 60 శాతం ఆల్కాహాల్ ఉన్న శానిటైజర్ ను వినియోగించండి. అయితే వీలైనంత వరకు సబ్బుతో కడిగితే ఉత్తమం.
సెకండ్ వేవ్ ( Coronavirus Second Wave )మరింత ప్రమాదం
శాస్త్రవేత్తల ప్రకారం మ్యూటేషన్ వల్ల వైరస్ నిరంతరం తన రూపాన్ని మారుస్తోంది. హ్యూస్టన్ ఇతర ప్రాంతాల్లో కరోనా సెకండ్ వేవ్ లో 1000 మందిపై పరిశోధన నిర్వహించగా D614G వైరస్ 99 శాతం వరకు రూపాంతచం చెందింది. అంటే తన రూపాన్ని మారుస్తోంది. ఇది మరింత ప్రమాదకరం అని అంటున్నారు వైద్యులు, శాస్త్రవేత్తలు.
Also Read: Vastu Tips: చీపురు వాడే సమయంలో ఈ తప్పులు చేయకండి |
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR
Covid-19 Second Wave: మళ్లీ కొరలు విప్పుతోన్న కరోనా.. ఈ టప్స్ పాటించండి