Eye Infections Solution: వర్షా కాలంలో కంట్లో ఇన్‌ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే..

Eye Infections Solution: వర్షా కాలంలో వాతావరణ మార్పులు, నీటి కాలుష్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అలా వచ్చే ఆరోగ్య సమస్యల్లో కంట్లో ఇన్‌ఫెక్షన్స్ కూడా ఒకటి. మరి ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి , ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Pavan | Last Updated : Jul 25, 2023, 12:52 PM IST
Eye Infections Solution: వర్షా కాలంలో కంట్లో ఇన్‌ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే..

Eye Infections Solution: వర్షా కాలంలో అనేక శారీరక రుగ్మతలు వచ్చేందుకు ఎంతో ఆస్కారం ఉంటుంది. అందుకు వాతావరణంలో పెనుమార్పులు ఒక కారణం అయితే... వర్షా కాలంలో నీటి కాలుష్యం లాంటి సమస్యలు మరో కారణంగా నిపుణులు చెబుతుంటారు. అలా వచ్చే ఆరోగ్య సమస్యల్లో కంట్లో ఇన్‌ఫెక్షన్స్ కూడా ఒకటి. మరి ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి , ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

చేతులు తరచుగా శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. కంట్లో చేతులు పెట్టి నలుముకునే అలవాటు మానేయాలి. మరి ముఖ్యంగా చేతికి మట్టి, మురికి అంటినప్పుడు వాటిని కడుక్కోకుండా అలాగే కంట్లో అస్సలు పెట్టుకోకూడదు. 

కంట్లో ఏ మాత్రం దురద అనిపించినా చేతులు శుభ్రంగా కడుక్కుని, ఆ తరువాత శుభ్రమైన నీటితో కళ్లు కడుక్కోవాలి.

కంట్లో దురదగా అనిపిస్తే.. ఆ కళ్లను అలాగే నలుముకోకుండా వామ్ కంప్రెస్‌తో వెచ్చబర్చుకోవాలి. అలా రోజులో నాలుగైదుసార్లు చేయొచ్చు. తద్వారా దురద లాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కంటికి హాయినిచ్చే అనుభూతి కలుగుతుంది. అయితే, మీరు ఉపయోగించే వామ్ కంప్రెస్ కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే నేరుగా కళ్లపైనే పెట్టుకుంటాం కనుక అది సమస్యను మరింత పెద్దది చేసే ప్రమాదం ఉంటుంది.

కంట్లో నలతగా ఉన్నప్పుడు కను రెప్పలకు, కంటికి మేకప్ వేయొద్దు. మేకప్‌లో ఉపయోగించే కెమికల్స్ సమస్య తగ్గకుండా ఇంకా పెద్దది అవుతుంది. అదే సమయంలో అదే మేకప్ టూల్స్ మరొకరు ఉపయోగిస్తే.. వారికి కూడా మీ నుంచి ఇన్‌ఫెక్షన్స్ వ్యాపించే ప్రమాదం ఉంటుంది. 

కంట్లో డ్రైనెస్ ఎక్కువై నలతగా ఉన్నప్పుడు, ఓవర్ ది కౌంటర్ లభించే ఆర్టిఫిషియల్ టీయర్స్ ఉపయోగించి ఉపశమనం పొందొచ్చు. 

ఒకవేళ ఓవర్ ది కౌంటర్ లభించే ఆర్టిఫిషియల్ టీయర్స్‌తో సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే వాటిని ఉపయోగించడం ఆపేసి ఐ కేర్ స్పెషలిస్టుని సంప్రదించాలి. వారి సలహా మేరకే ప్రిస్క్రైబ్ చేసిన ఐ డ్రాప్స్‌నే వినియోగించాల్సి ఉంటుంది.

కంటికి హానీ చేసే బ్యాక్టీరియా ఎక్కువగా బెడ్ పైనో లేక ముఖం తుడుచుకునే టవల్స్ పైనో తిష్ట వేసుకుని కూర్చుని ఉంటుంది. అందుకే తరచుగా బెడ్ షీట్స్, టవల్స్ శుభ్రంగా వాష్ చేస్తూ ఉండాలి. మరీ ముఖ్యంగా పిల్లో కవర్స్ విషయంలో ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే కళ్లకు క్లోజ్ కాంటాక్టులో ఉండేది మెత్తలే కదా.

ఇది కూడా చదవండి : Diet Coke, Sugar Free Drinks: అలాంటి డ్రింక్స్ తాగితే క్యాన్సర్ వస్తోందా ?

బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, టవల్స్ వంటివి ఇతరులతో కలిసి షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే కళ్లకు క్లోజ్ కాంటాక్టులో ఉండే వీటితో ఇన్‌ఫెక్షన్స్ వ్యాపించే ప్రమాదం ఉంది అని ఐ కేర్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. వర్షా కాలంలో స్విమ్మింగ్ చేయకూడదు. వానా కాలంలో నీటి కాలుష్యం సహజం. అలా నీటిలో ఉండే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా కంటికి హాని చేస్తాయి.

ఇది కూడా చదవండి : Side Effects of Red Bull: రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్‌తో భరించలేని అనారోగ్య సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్

ఇది కూడా చదవండి : Side Effects of Maggi: మ్యాగీ తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌లో ప్రాణాంతకమైన జబ్బు ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News