Dahi Idli: సౌత్ ఇండియన్ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ దహీ ఇడ్లీ ! తయారు చేయడం ఎంతో సులభం..

Dahi Idli Recipe: మనం పెరుగు వడ్డను ఎంతో ఇష్టంగా తింటాము. అలాగే మీరు ఎప్పుడైన దహీ ఇడ్లీని ట్రై చేశారా. ఈ డిష్‌ సౌత్ ఇండియన్ బేక్స్ ఫాస్ట్.  కొన్ని ప్రదేశాల్లో ఈ దహీ ఇడ్లీ ఫేమస్. బ్రేక్ ఫాస్ట్ కు ఈ స్పెషల్ పెరుగు ఇడ్లీలు తయారుచేయాలంటే, ఇది చాలా సులభం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2024, 09:40 PM IST
Dahi Idli: సౌత్ ఇండియన్ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ దహీ ఇడ్లీ  ! తయారు చేయడం ఎంతో సులభం..

Dahi Idli Recipe: దహీ ఇడ్లీ సౌత్ ఇండియన్ బేక్స్ ఫాస్ట్ రిసిపి. దీనిని మనం బ్రేక్‌ ఫాస్ట్‌లో చేసుకొని తినడం వల్ల ఎంతో రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. బ్రేక్‌ ఫాస్ట్‌లో పెరుగు ఇడ్లీలు తయారుచేయాలంటే, ఇది చాలా సులభం మార్గం. ఈ ఇడ్లీ తినడం వల్ల కడుపు చల్లగా ఉంటుంది. చిన్న పిల్లలు దీని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా పెరుగు నేరుగా తినడం ఇష్టం లేనివారు ఇలా తయారు చేసి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ డిష్‌ పెద్దలకు ఎంతో రుచికరంగా ఉంటుంది. దీని కోసం మీరు ఇంట్లో తరుచుగా లభించే పదార్థాలు ఉపయోగిస్తే సరిపోతుంది.

దహీ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు:

ఇడ్లీలు

ఐదు కప్పుల- పెరుగు

రెండు కప్పుల- పాలు

కొత్తిమీర

క్యారెట్ తురుము

ఒక టేబుల్‌ స్పూన్‌ - షుగర్

 ఉప్పు

మూడు టేబుల్ స్పూన్లు-  కొబ్బరి

నాలుగు పచ్చిమిరపకాయలు
 ఆవాలు

కరివేపాకు 

ఎండు మిరపకాయలు 

 ఇంగువ 

నూనె 

దహీ ఇడ్లీ తయారు చేసే విధానం: 

ముందుగా ఇడ్లీలను తయారుచేసుకోవాలి. ఇడ్లీలు తయారు చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కులుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.  ఇందులోకి పెరుగు, పాలు, ఎగ్‌ బీటర్‌ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమానిలోకి పంచదార, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులోకి ఆవాలు, ఉద్దిపప్పు, రెడ్‌ చిల్లీ, కరివేపాకు వేసుకోవాలి. మూడు నిమిషాల పాటు నూనెలో వేగించుకోవాలి.

ఇప్పుడు అందులో ముందుగా కలిపి పెట్టుకొన్న పెరుగు, ఇంగువ వేసి మిక్స్ చేయాలి.  జీడిపప్పు పొడి, పచ్చిమిర్చి, మరియు కొబ్బరి తురుము వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పెరగు మిశ్రంలో ముందుగా తయారుచేసి పెట్టుకొన్న ఇడ్లీలను వేయాలి. వేసిన తర్వాత 15నిముషాలు నాననివ్వాలి. ఈ విధంగా దహీ ఇడ్లీ తయారు చేసుకోవాలి. దీనిని చిన్నపిల్లులు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.

Also Read Silver Anklets: పాదాలకు బంగారం పట్టీలు ఎందుకు ధరించకూడదు ? కలిగే నష్టాలు ఏంటి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News