Blood Thinning Foods: రక్తాన్ని పలుచగా చేసి ఆహారాలు ఇవే.. వీటిని తింటే జన్మలో గుండె జబ్బులు రావు!

How To Make Blood Thinner Naturally: ప్రస్తుతం చాలామందిలో రక్తం చిక్కగా తయారై అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కొంతమందిలోనైతే ప్రాణాంతకమైన గుండెపోటు ఇతర వ్యాధులు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి రక్తం పలుచగా తయారు కావడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ ఆహారాలను తీసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2024, 04:26 PM IST
Blood Thinning Foods: రక్తాన్ని పలుచగా చేసి ఆహారాలు ఇవే.. వీటిని తింటే జన్మలో గుండె జబ్బులు రావు!

How To Make Blood Thinner Naturally: మనిషి ఆరోగ్యంగా ఉండడానికి శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేయాల్సి ఉంటుంది. బాడీలోని పార్ట్స్ సరైన పద్ధతిలో పనిచేయడానికి రక్తం కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి మనిషి ఆరోగ్యానికి రక్తప్రసరణ వ్యవస్థ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగితేనే రక్తం పల్చగా ఉంటేనే వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా గుండెపోటు, మధుమేహం, అధిక రక్తపోటు ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో అనేక రకాల గుండె సమస్యలు వస్తున్నాయి. 

ప్రస్తుతం చాలామంది వైద్యులు గుండె సమస్యలు రాకుండా రక్తాన్ని పలుచగా చేసేందుకు ఖరీదైన ఔషధాలను సూచిస్తున్నారు. అయినప్పటికీ కొంతమందిలో రక్తం ఎప్పటిలాగా చిక్కగానే ఉంటుంది. దీని కారణంగా మళ్ళీ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని ఆహారాలను తీసుకుంటే రక్తం పలుచగాను అలాగే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని వారు అంటున్నారు.

రక్తాన్ని పలుచగా చేసేందుకు సాల్మ‌న్ చేపలు కీలక పాత్ర పోషిస్తాయి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు అధిక మోతాదులో లభిస్తాయి కాబట్టి ఇప్పటికే గుండె సమస్యలు, రక్తం ఎక్కువగా చిక్కగా ఉన్నవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దీంతోపాటు మాకేరెల్, సార్డినెస్ వంటి సముద్రపు జాతికి చెందిన చేపలను తీసుకోవడం వల్ల కూడా రక్తాన్ని పల్చగా చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే కొన్ని రసాయనాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కూడా సులభంగా కరిగిస్తాయి. కాబట్టి అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వారానికి ఒక్కసారైనా ఈ చేపలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

అలాగే రక్తాన్ని పల్చగా చేసేందుకు అల్లం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో సాలిసైలేట్, ఆస్పిరిన్ వంటి రసాయన లక్షణాలు అధిక మోతాదులో లభిస్తాయి కాబట్టి దీనిని ప్రతిరోజు ఆహారంలో వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అల్లం గుండె ఆరోగ్యాన్ని పెంచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. దీంతోపాటు వెల్లుల్లిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల కూడా రక్తం పలుచగా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో లభించే ఆయుర్వేద గుణాలు కూడా రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అలాగే రక్త సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతిరోజు బ్లూ బెర్రీస్‌తో పాటు స్ట్రాబెరీలను తీసుకోవచ్చు.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News