How to Lose Weight without Gym: ప్రస్తుతం చాలా మంది వీధుల్లో లభించే ఆహారాలు అతిగా తినడం వల్ల సులభంగా బరువు పెరుగుతున్నారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్ సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల జిమ్‌కు వెళ్లకుండా కూడా సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జిమ్‌కు వెళ్లకుండా ఈ ఆసనాలతో బెల్లీ ఫ్యాట్‌కు చెక్:
ఇంట్లో త్రికోణాసనం వేయండి:
ఇంట్లో ప్రతిరోజూ త్రికోణాసనం వేయడం వల్ల వారం రోజుల్లోనే మంచి ఫలితాన్ని పొందొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆ ఆసనం వేయడం వల్ల బరువు తగ్గడమేకాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
త్రికోణాసనం ఎలా చేయాలి:
త్రికోణాసనం చేయడానికి.. ముందుగా మీ రెండు కాళ్లను వేరు చేసి.. నిటారుగా నిలబడండి. ఈ సమయంలో మీ బరువు రెండు కాళ్లపై సమానంగా పడాలి. దీని తర్వాత మీ ఎడమ చేతిని నెమ్మదిగా పైకి లేపండి.. పాదాలతో కుడి చేతిని అంటండి, నెమ్మదిగా దానిని నేల వైపుకు వంచండి. ఇలా రెండు చేతులు సరళ రేఖలో వస్తాయి. దీని తర్వాత మరొక వైపు నుంచి అదే చేయండి. ఎడమ చేతిని క్రిందికి తీసుకురండి. ఈ ఆసనాన్ని ప్రతి రోజూ 50 నుంచి 100 సార్లు వేయచ్చు. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల కేవలం వారం రోజుల్లో బరువు తగ్గొచ్చు.
ఈ క్రమంలో జంక్ ఫుడ్‌ని తినొద్దు:
త్రికోణాసనం చేయడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అయితే ఈ ఆసనాలు చేసే క్రమంలో జంక్ ఫుడ్ తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కేవలం డైట్ పద్ధతిలో మాత్రమే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే బరువు తగ్గడం చాలా కష్టమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ క్రమంలో స్వీట్లను తినడం కూడా మానుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, నిపుణుల సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు)
Also Read: Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?
Also Read: Upasana Baby Bump Pics : రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు.. ఉపాసన బేబీ బంప్ పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook