How To Get Rid Of Arm Fat: చాలా మందిలో శరీర బరువు పెరిగినప్పుడు పొట్ట, నడుము చుట్టూ కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా కొంత మందిలో చేతుల్లో కూడా విపరీతమైన కొలెస్ట్రాల్ పెరిగి వేలాడుతూ ఇబ్బంది కరంగా మారుతోంది. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చల విడిగా తినడం వల్లేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారాన్ని డైట్ పద్దతిలో తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
వేలాడుతున్న కొవ్వును తగ్గించుకోవడానికి ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది:
ఆయిల్ ఫుడ్స్:
భారతదేశంలో ఆయిల్ ఫుడ్ తినే ట్రెండ్ చాలా ఎక్కువగా ఉంది. కొంతమంది అల్పాహారం, లంచ్, డిన్నర్‌లో ఎక్కువగా నూనె అధికంగా ఉండే ఆహారాన్ని తింటున్నారు. అయితే ఇలాంటి ఆహారాలు ప్రతి రోజూ తినడం వల్లే ఊబకాయం సమస్యలకు గురవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగానే చేతుల్లో కొవ్వు పేరుకుపోతుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మందిలో ఇలా కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల బీపీ, గుండె పోటు సమస్యలు కూడా వస్తున్నాయి.
తీపి పదార్థాలు:
భారతీయులు ఏదైనా ఆహారం తిన్న తర్వాత స్వీట్లు తినడం ఆనవాయిగా వస్తోంది. అయితే వీటిని అతిగా తినడం వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా చాలా మందిలో దీని కారణంగానే రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగి మధుమేహం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు షుగర్‌కి బదులుగా తేనెను వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నవారు చక్కెర పరిమాణాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిది.
పిండి వంటలు:
మనం తరచుగా పూరీలు, పరాటాలు, సమోసాలు, బిస్కెట్లు వంటి పిండితో చేసిన వాటిని తినడానికి ఇష్టపడతాము. అయితే దీని వల్ల కూడా చేతుల బరువు, కొలెస్ట్రాల్ కూడా పెరిపోతోంది. అయితే బరువు తగ్గాలనుకునేవారు పిండి వంటలను తినకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీటికి బదులుగా బ్రెడ్ తినడం చాలా మంచిది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: TSPSC JL Recruitment: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. అప్లికేషన్ ప్రక్రియ వాయిదా
Also Read: మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలు, రాళ్లతో వైసీపీ-టీడీపీ నేతల పరస్పర దాడి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook