Hair Packs: అందమైన పొడుగైన జుట్టు కోరుకుంటున్నారా..ఈ హోమ్‌మేడ్ ప్యాక్స్ వాడి చూడండి

Hair Packs: మహిళలు ఎక్కువగా జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. కొంతమందికి జుట్టు ఎదగక..మరి కొద్దిమందికి జుట్టు రాలడం, ఇంకొంతమందికి జుట్టు పల్చగా ఉండటం. కొన్ని రకాల వంటింటి చిట్కాలతో ఈ సమస్యల్నించి సులభంగా గట్టెక్కవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 26, 2022, 06:27 PM IST
Hair Packs: అందమైన పొడుగైన జుట్టు కోరుకుంటున్నారా..ఈ హోమ్‌మేడ్ ప్యాక్స్ వాడి చూడండి

Hair Packs: మహిళలు ఎక్కువగా జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. కొంతమందికి జుట్టు ఎదగక..మరి కొద్దిమందికి జుట్టు రాలడం, ఇంకొంతమందికి జుట్టు పల్చగా ఉండటం. కొన్ని రకాల వంటింటి చిట్కాలతో ఈ సమస్యల్నించి సులభంగా గట్టెక్కవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు

ఆధునిక జీవనశైలిలో ఎదురయ్యే సమస్యల్లో ఒకటి జుట్టు సమస్య. ముఖ్యంగా మహిళలకు చాలా ఇబ్బంది ఎదురౌతుంటుంది. ఉన్న జుట్టు రాలిపోవడం లేదా జుట్టు సరిగ్గా ఎదగకపోవడం. ఎందుకంటే చాలామందికి అందమైన, పొడుగైన జడ ఉండాలనే కోరిక ఉంటుంది. చెడు ఆహారపు అలవాట్ల ప్రభావం ఆరోగ్యంపై పడుతోంది. దాంతో చర్మం, జుట్టు పాడవుతుంటాయి. ముఖ్యంగా జుట్టు డ్రైగా మారి..చిక్కుళ్లు పడటమే కాకుండా ఎదుగుదల కూడా ఆగిపోతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే హెయిర్ ప్యాక్ వాడటం అవసరం. దీనికోసం ఏ బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చునే..ఇంట్లో లభించే వస్తువులతోనే హెయిర్ గ్రోత్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. అదెలాగా చూద్దాం..

హెయిర్ గ్రోత్ ప్యాక్ తయారీ ఎలా

మీ జుట్టు ఎదుగుదల ఆగిపోయుంటే..శెనగపప్పు, మెంతి గింజలతో ప్యాక్ చేసుకోవాలి. దీనికోసం 2 స్పూన్ల శెనగలు, 2 స్పూన్ల మెంతులు రాత్రంతా విడివిడిగా నానబెట్టాలి. ఒక స్పూన్ తేనె, 2 స్పూన్ల ఆముదం నూనె, ఒక స్పూన్ జోజోబా ఆయిల్, 4 లెమన్ డ్రాప్స్ అవసరమౌతాయి. ముందుగా మిక్సీలో శెనగలు, మెంతులు, తేనె, ఆముదం నూనె, జోజోబా ఆయిల్, లెమన్ డ్రాప్స్ వేసి ఆడించాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకళ్లో దట్టించాలి. వెంట్రుకల వేళ్లలో తగిలేలా అప్లై చేయాలి. అరగంట తరువాత శుభ్రంగా నీళ్లతో కడగాలి. 

ఫ్లెక్స్‌సీడ్స్, నిమ్మరసంతో ప్యాక్

ఫ్లెక్స్‌సీడ్స్ కూడా ఆరోగ్యానికి చాలా లాభదాయకం. ఈ సీడ్స్‌ను ముఖం నుంచి జుట్టు వరకూ అందాన్ని పెంచేందుకు వినియోగించవచ్చు. రాత్రంతా నానబెట్టిన ఫ్లెక్స్‌సీడ్, నిమ్మరసం, 2 కప్పుల నీళ్లు అవసరం.  ముందుగా నానబెట్టిన ఫ్లెక్స్‌సీడ్స్‌లో రెండు కప్పుల నీళ్లు పోసి ఉడకబెట్టాలి.పేస్ట్‌గా మారిన తరువాత..ఇందులో నిమ్మకాయ పిండాలి. చల్లబడిన తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు మెదళ్లలో రాయాలి. ఓ అరగంట ఉంచి..నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారంలో 2 సార్లు తప్పకుండా చేయాలి. 

Also read: Thyroid Disease: థైరాయిడ్ లక్షణాలేంటి, రోజూ ఆ మిశ్రమం తీసుకుంటే థైరాయిడ్‌కు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News