How Prevent Lower Back Pain: వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా నడుంనొప్పి (Lower back pain) మిమ్మల్ని బాగా ఇబ్బందిపెడుతోందా? అయితే.. కొన్ని ఆసనాలతో దానికి చెక్ (What causes lower back pain) పెట్టొచ్చు. ముఖ్యంగా మార్జాలాసనం గురించి చెప్పుకోవాలి. నిశితంగా గమనిస్తే మనం పెంపుడు జంతువుల నుంచీ ఎంతో నేర్చుకోవచ్చు. మార్జాలాసనం (Marjariasana benefits) అలాంటిదే. శరీరాన్ని పిల్లిలా సాగదీసే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఎలా చేయాలి?
ముందుగా వజ్రాసనం (Lower back pain exercises) వేసి కూర్చోవాలి. శరీరాన్ని ముందుకు వంచుతూ మోకాళ్లు, అరచేతులు నేలకు ఆనించాలి. అరచేతులు భుజాలకు, మోకాళ్లు తుంటికి సమాంతరంగా ఉండాలి.
నెమ్మదిగా శ్వాస వదులుతూ.. నడుమును వీలైనంత పైకి లేపాలి. తలను కొద్దిగా కిందికి దింపాలి. కాసేపు అలాగే ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ.. నడుమును (Strength exercises for lower back pain) కిందికి వంచుతూ, తలను పైకి ఎత్తాలి. కాసేపు అలాగే ఉండాలి. (ఇలా ఐదారు సార్లు చేయాలి)
వీటన్నింటికీ చెక్..
ఇలా చేయడం వల్ల వెన్నెముక వదులవుతుంది. శరీరంలో చురుకుదనం, నడుము నొప్పి తగ్గుతుంది. మణికట్టు, భుజాలు బలోపేతమవ్వడం సహా జీర్ణకోశ అవయవాలకు మర్దన, జీర్ణక్రియ పుంజుకుంటుంది. కడుపులోని కొవ్వు తగ్గి, కండరాలు బిగువుగా అవుతాయి. కడుపులోని కొవ్వు తగ్గుతుంది. మానసిక ప్రశాంతతతో పాటు రక్త ప్రసరణ మెరుగవుతుంది.
Also Read:Tips For Protecting Your Skin: శీతాకాలంలోని చలిగాలుల నుంచి చర్మాన్ని కాపాడుకోవడం ఎలా?
Also Read: మీ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందా, ఈ పదార్ధాలతో తగ్గించుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook