High Cholesterol: కొలెస్ట్రాల్‌ను తగ్గించే సాధరణ చిట్కాలు ఇవే, ఇలా చేయండి చాలు!

High Cholesterol Normal Rang: కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవాలనుకునవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఫైబర్‌ అధిక పరిమాణంలో కలిగిన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2023, 06:18 PM IST
High Cholesterol: కొలెస్ట్రాల్‌ను తగ్గించే సాధరణ చిట్కాలు ఇవే, ఇలా చేయండి చాలు!

 

High Cholesterol: గుండె ఆరోగ్యంగా ఉంటేనే శరీరం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మన శరీరానికి అతి ముఖ్యమైన భాగం..దీని వల్లే మొత్తం శరీరానికి రక్తం సరఫరా అవుతుంది. కాబట్టి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది.  గుండె ఆరోగ్యంగా ఉండటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా ప్రతి రోజు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. దీని కారణంగానే గుండె సమస్యలు వస్తున్నాయి. 

శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడం కారణంగా చాలా మంది గుండెతో పాటు చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే వీటి నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే మందులను వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా జీవనశైలిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం, సహాజ పద్ధతిలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం ఈ కింది చిట్కాలు పాటించండి. 

ఫైబర్ గల ఆహారాలు తీసుకోండి:
శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు నియంత్రించుకోవాలనుకునేవారు తప్పకుండా శరీరంలో  కరిగే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల సులభంగా కొలెస్ట్రాల్‌ పరిమాణాలు కరుగుతాయి. దీని కోసం మీరు ప్రతి రోజు గంజి, కిడ్నీ బీన్స్, బ్రస్సెల్స్ మొలకలు తీసుకోవాల్సి ఉంటుంది. 

జంతువుల కొవ్వు తినడం మానుకోవాల్సి ఉంటుంది:
అధిక కొలెస్ట్రాల్ పరిమాణాలు నియంత్రించుకోవాలనుకునేవారు జంతువుల కొవ్వు అధిక పరిమాణంలో లభించే ఆహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. దీంతో పాటు పాలు, చీజ్, క్రీమ్, సోర్ క్రీం, క్రీమ్ చీజ్ కలిగిన ఆహారాలు తీసుకోవడం కూడా మానుకోవాల్సి ఉంటుంది. వీటిని తినకపోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు నియంత్రణలో ఉండే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

బరువు తగ్గండి:
అధిక బరువు లేదా ఊబకాయం సమస్యలతో బాధపడేవారు ఎంత సులభంగా నియంత్రించుకుంటే అంతమంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గడం వల్ల LDL చెడు కొలెస్ట్రాల్‌ పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.

కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారాలు మానుకోండి:
ప్రతి రోజు తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల సులభంగా బరువు కూడా తగ్గుతారు. అంతేకాకుండా గుండెపోటు ప్రమాదం తగ్గే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొలెస్ట్రాల్‌ నియంత్రించుకోవాలనుకునేవారు ప్రతి రోజు తృణధాన్యాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News