High BP: ఈ 3 అలవాట్లు మీ రక్తపోటును పెంచుతాయి, వీటికి దూరంగా ఉంటే మంచిది

High BP Problem: అధిక రక్తపోటు ఆరోగ్యానికి చాలా చెడ్డది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీన్ని నివారించడానికి, ఆరోగ్యానికి హాని కలిగించే అలవాట్లకు దూరంగా ఉండండి.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2022, 01:09 PM IST
High BP: ఈ 3 అలవాట్లు మీ రక్తపోటును పెంచుతాయి, వీటికి దూరంగా ఉంటే మంచిది

How to Control High Blood Pressure: గుండె జబ్బులకు ప్రధాన కారణాల్లో ఒకటి అధిక రక్తపోటు.  హైపర్‌ టెన్షన్‌నే 'హై బీపీ' (High BP) అంటారు. సాధారణంగా అధిక రక్తపోటు సమస్యకు జీవనశైలి, ఆహారపు అలవాట్లే కారణం. 

అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలు: 
*ఊబకాయం
*ధూమపానం
*మద్యం 
*అసమతుల్య ఆహారం
*నిద్ర లేకపోవడం
*టెన్షన్ లేదా డిప్రెషన్
*శారీరక శ్రమ తగ్గుదల

High BPని తగ్గించడానికి ఈ 3 అలవాట్లను మార్చుకోండి
రక్తపోటు విషయంలో ఏమి చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల అధిక రక్తపోటు సమస్య చాలా కాలం పాటు కొనసాగుతుంది. హైపర్ టెన్షన్ రాకుండా ఉండాలంటే ఏం చేయకూడదో తెలుసుకుందాం.

1. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం
ఉప్పు లేదా సోడియం అధిక రక్తపోటు, గుండె జబ్బుల సమస్యను పెంచుతుంది. ఉప్పు (Salt) ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. శరీరానికి పని చేసే శక్తిని ఇవ్వడానికి కొంత మొత్తంలో ఉప్పు అవసరం అయినప్పటికీ, దాని అధిక వినియోగం అధిక BP సమస్యను పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో, రోజూ ఒక టీస్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు. 

2. అధిక కొవ్వు ఆహారం తినడం
రక్తపోటును నియంత్రించడానికి, మీరు కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలకు (Fatty Foods) దూరంగా ఉండాలి. పాలు-క్రీమ్, వెన్న, మాంసం మొదలైనవి అధిక మొత్తంలో సంతృప్త కొవ్వును కలిగి ఉంటాయి. అందువల్ల మీరు వాటిని తినకుండా ఉంటే మంచిది. 

3. మద్యపానం
రక్తపోటు సమస్య ఉన్నవారు మద్యానికి (Drinking Alcohol) దూరంగా ఉండాలి.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక రక్తపోటు సమస్య లేని వారు కూడా మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా భవిష్యత్తులో ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. 

Also Read: Raw Banana Benefits: పచ్చి అరటిపండును తినండి... ఈ వ్యాధులను దూరం చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News