Heart Disease: గుండె అనేది శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి. గుండెను పదికాలాలు పదిలంగా ఉంచుకోవాలంటే..గుండె సంబంధిత వ్యాధుల్నించి సంరక్షించుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం..
గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. గుండె ఆరోగ్యంగా లేకుంటే అన్నీ సమస్యలే. శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేసేది గుండెనే. ఆక్సిజన్‌తో పాటు ఆరోగ్యానికి కావల్సిన పోషక పదార్ధాల్ని చేరవేస్తుంది. అందుకే గుండెలో ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా చాలా సమస్యలకు దారితీస్తుంది. గుండెను ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే..గుండె సంబంధిత వ్యాధుల్నించి సంరక్షించుకోవాలనుకుంటే..ఏ చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. గుండెకు సంబంధించిన ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకూడదో తెలుసుకుందాం..
హార్ట్ ఎటాక్, గుండెలో నొప్పి ప్రధాన కారణాలు కావచ్చు. మీకు తరచూ గుండెలో నొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు. అది కాకుండా గుండెలో నొప్పి, మంటగా ఉన్నా సరే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఏంజెనాలో కూడా గుండె నొప్పి రావచ్చు. ఏంజెనా అనేది గుండెలో చెడు రక్త ప్రవాహానికి కారణం కావచ్చు. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనుల గోడలపై పెద్ద పెద్ద గడ్డల్లా ఏర్పడతాయి. ఈ పరిస్థితుల్లో ధమనుల్నించి రక్త సరఫరా పూర్తి కాదు. ఫలితంగా గుండెలో నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అందుకే వీటిని నిర్లక్ష్యం చేయకూడదు.
అధిక రక్తపోటు గుండెకు సంబంధించిన సమస్యే. ఇందులో వ్యక్తి రక్త ప్రసరణలో ఒత్తిడి అధికమౌతుంది. ఫలితంగా గుండెలో నొప్పి రావచ్చు. అందుకే ఈ లక్షణాన్ని కూడా ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే రక్తపోటు అనేది సీరియస్ గుండె సంబంధిత సమస్యల్లో ఒకటి.
Also read: Weight Loss Tips: బరువు తగ్గాలను కుంటున్నారా.. ఇలా 3 వారాల పాటు నల్ల జీలకర్రను తీసుకోండి చాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook