Heart Attack Risk: ముప్పై నలభై ఏళ్లకే గుండెపోటు సమస్య, కారణాలేంటో తెలుసా

Heart Attack Risk: ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. నాలుగు పదులు నిండకుండానే తనువు చాలించేస్తున్నారు. గుండెపోటుకు ఇప్పుడు వయస్సు మారిపోయింది. అందర్నీ పలకరిస్తోంది. ప్రాణాంతకమై బలితీస్తోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 17, 2023, 10:52 PM IST
Heart Attack Risk: ముప్పై నలభై ఏళ్లకే గుండెపోటు సమస్య, కారణాలేంటో తెలుసా

గుండెపోటు అత్యంత ప్రమాదకరమైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ప్రాణాలే పోవచ్చు. ఒకప్పుడు వయస్సు 50 దాటితే ఎదురైన గుండెపోటు సమస్య ఇప్పుడు 4 పదుల వయస్సుకే వెంటాడుతోంది. కొన్ని సందర్భాల్లో 20-30 ఏళ్లకే గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఎదురౌతుందో తెలుసుకుందాం..

మనిషి ప్రాణంతో ఉన్నాడా లేదా అని తెలిసేది గుండె చప్పుడుతోనే. ఆ చప్పుడు ఆగిందంటే ప్రాణం పోయినట్టే. అందుకే గుండెను ఎప్పుడూ ఆరోగ్యంగా చూసుకోవాలి. గుండెపోటు రాకుండా ఉండాలంటే గుండె ఆరోగ్యం ముఖ్యం. ముఖ్యంగా డయాబెటిస్ రోగుల్లో గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుంది. చెడు ఆహారపు అలవాట్ల కారణంగానే గుండె సమస్యలైనా, డయాబెటిస్ ముప్పైనా తలెత్తుతుంది. రెండూ ఒకదానికొకటి ప్రభావితమై ఉంటాయి. డయాబెటిస్ రోగుల్లో బ్లడ్ షుగర్ స్థాయి సరిగ్గా లేకపోతే..బ్లడ్ ప్లెషర్ పెరుగుతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

40-45 ఏళ్లకు గుండెపోటు వెనుక కారణాలు

ప్రస్తుతం చాలామందిలో 40-45 ఏళ్లకే గుండెపోటు సమస్యలు చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం డయాబెటిస్ లేదా చెడు ఆహారపు అలవాట్లు లేదా రక్తపోటు. చెడు జీవనశైలి కూడా ప్రధాన కారణంగా ఉంది. ఈ మూడు కూడా చెడు ఆహరపు అలవాట్ల కారణంగానే వస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే గుండెపోటు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. బ్లడ్ షుగర్ ఎక్కువైతే రక్తపోటుకు కారణమౌతుంది. అధిక రక్తపోటు గుండెపోటుకు దారితీస్తుంది. 

కొలెస్ట్రాల్ పెరగడం

చెడు ఆహారపు అలవాట్ల కారణంగా 40 ఏళ్ల వయస్సుకే కొలెస్ట్రాల్ ప్రధాన సమస్యగా మారుతుంది. డయాబెటిస్ సమస్య లేకపోయినా..కొలెస్ట్రాల్ ఉంటే అది గుండెపోటుకు కారణం కాగలదు. కొలెస్ట్రాల్ నియంత్రణ చాలా అవసరం. మసాలా అధికంగా ఉన్న తిండికి దూరంగా ఉండాలి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే..బ్లడ్ క్లాట్స్ వచ్చి..హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుంది. 

30 ఏళ్ల వయస్సు నుంచే చాలామంది ఒత్తిడికి లోనవుతుంటారు. ఒత్తిడి కారణంగా మనకు తెలియకుండానే బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితుల్లో స్మోకింగ్, మద్యం అలవాట్లుంటే గుండెపోటు సమస్య అధికమౌతుంది. డయాబెటిస్ ఉన్నప్పుడు గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవాలంటే..బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలి. శరీర బరువు కూడా అదుపులో ఉండాలి. పరిమితంగా వ్యాయామం చేయాలి. గుండె ఆరోగ్యానికి ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవాలి.

అందుకే ముఖ్యంగా బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ ఈ రెండింటిపై ప్రధానంగా దృష్టిపెట్టాలి. మధుమేహం, అధిక రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్ సమస్య తలెత్తకపోతే గుండెపోటును చాలావరకూ నియంత్రించినట్టే.

Also read: Aadhaar Card Download: ఇక ఆధార్ కార్డు డౌన్‌‌లోడ్ మరింత సులభం, ఎలాగంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News