Heart Attack Risk: ఉదయాన్నే పళ్లు తోముకొని, నోరు శుభ్రం చేసుకోకపోతే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని మీకు తెలుసా? అవును.. నోరు సరిగా శుభ్రం చేసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దంత క్షయం, నోటి క్యాన్సర్ వంటి సమస్యలు రావొచ్చు. అయితే నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల కలిసే అనర్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె సమస్యలకు అవకాశం..
నోటి కుహరంలో లక్షలాది బ్యాక్టీరియా నివసిస్తుంటుంది. అందుకే నోటి పరిశుభ్రత కచ్చితంగా అవగాహన ఉండాలని వైద్యులు చెబుతుంటారు. నోటిని పరిశుభ్రం చేసుకోవడం చాలా వరకు బ్యాక్టీరియా తొలగిపోతుంది. అయితే కొందరు నోటిని శుభ్రం చేసుకునేందుకు బద్ధకిస్తూ ఉంటారు. అలాంటి వారు కొద్దికాలంలో గుండె సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. సరిగా బ్రష్ చేయకపోవడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా గుండెకు చేరేందుకు అవకాశం ఉంది.
రోజూ పరిశుభ్రంగా..
బ్రష్ చేసే సమయంలో ఓ సరైన పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల మీ నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం సహా చిగుళ్లకు ఎలాంటి హానీ కలుగదు. మీ టూత్ బ్రష్ ను చిగుళ్ల నుంచి 45 డిగ్రీల కోణంలో ఉంచి.. ఆ తర్వాత మెల్లిగా ముందుకు వెనుకకు బ్రష్ ను కదిలించాలి. ముందుగా ఎదురు దంతాలను, దంతాల వెలుపల శుభ్రం చేసిన తర్వాత.. దంతాల ఉపరితలం లోపు బ్రష్ చేయాలి. దీని తర్వాత నాలుకను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల నోరు పరిశుభ్రం అవుతుంది.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా వైద్య నిపుణుల సలహాలు, సూచనలు ద్వారా గ్రహించింది. దీన్ని పాటించే ముందు దంత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని ZEE తెలుగు NEWS ధ్రువీకరించడం లేదు.)
Also Read: Coconut Water Benefits: ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగితే హైబీపీతో పాటు అనేక సమస్యలకు ఫుల్ స్టాప్!
Also Read: Knee Pain Remedies: ఈ పండ్లు తింటే కీళ్ల నొప్పులు, వాపులు తప్పకుండా తగ్గుతాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.