Headache Remedies : ఈ చిన్న చిట్కాలు ట్రై చేయండి.. క్షణాల్లో తలనొప్పి నుంచి ఉపశమనం

Headache Tips: కొంతమందికి చీటికిమాటికి.. తలనొప్పి వస్తూ ఉంటుంది. వాళ్లు అదేపనిగా తలనొప్పి టాబ్లెట్లు.. వాడుతూ ఉంటారు. దానివల్ల తలనొప్పి తగ్గుతుందో లేదో పక్కన పెడితే.. ఆరోగ్యం మాత్రం చెడిపోతుంది. మన ఇంట్లోనే తలనొప్పి తగ్గేందుకు.. కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఈసారి తలనొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్లకు బదులుగా.. ఈ చిట్కాలను వాడి చూడండి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 13, 2024, 02:33 PM IST
Headache Remedies : ఈ చిన్న చిట్కాలు ట్రై చేయండి.. క్షణాల్లో తలనొప్పి నుంచి ఉపశమనం

Headache Immediate Relief: జ్వరంగా ఉన్నప్పుడు కంటే తలనొప్పిగా ఉన్నప్పుడు.. అసలు ఏ పని చేయ బుద్ధి కాదు. అయితే తలనొప్పుల్లో కూడా 200 పైగా రకాలు ఉన్నాయని మీకు తెలుసా? వాటిలో దేనివల్ల.. తలనొప్పి వస్తుంది అనేది తెలుసుకోవడం కూడా కష్టమే. అయితే తల మెడ భాగాల్లో కొన్ని సున్నితమైన ప్రాంతాలు ఉంటాయి. అవి ఒత్తిడికి లోనైనా, తలలోని రక్తనాళాల మీద ఒత్తిడి పడినా.  ఎక్కువగా తలనొప్పి వస్తూ ఉంటుంది. అదేమీ పెద్ద జబ్బు కాదు. కానీ తలనొప్పి వచ్చినప్పుడు.. టాబ్లెట్లు వాడి ఉపశమనం పొందడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే తలనొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్ల జోలికి వెళ్ళకుండా ఇంట్లోనే.. ఉండే ఆహార పదార్థాలతో తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు. తలనొప్పి తగ్గడానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

నిమ్మరసం:

ఎలాంటి సమయంలోనైనా నిమ్మరసం.. తగితే చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు కూడా ఒక గ్లాసు వేడి నీటిలో.. కొద్దిగా నిమ్మరసం పిండుకొని తాగితే.. త్వరగానే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఆవు పాలు: 

ఆవు పాలు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనవి.. అని ఎప్పుడు వింటూనే ఉంటాం. గోరువెచ్చని ఆవు పాలను తాగడం వల్ల కూడా తలనొప్పి నియంత్రణలోకి వస్తుంది.

యూకలిప్టస్ ఆయిల్:

యూకలిప్టస్ ఆయిల్ వల్ల.. మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందులో తలనొప్పి తగ్గడం కూడా ఒకటి. 

గంధం:

గంధానికి శరీరాన్ని చల్లబరిచే గుణం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు.. నుదుటిపై కొంచెం గంధం రాసుకొని చూడండి. రాసుకున్న వెంటనే చల్లగా అనిపించడంతోపాటు తలనొప్పి కూడా త్వరగా తగ్గుతుంది.

అల్లం టీ:

అల్లం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అల్లంతో పాలు లేకుండా టీ చేసుకుని.. తాగడం కూడా మంచిదే. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అల్లం టీ తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. అల్లం టీ చేసుకునే సమయం లేకపోతే.. కొంచెం అల్లాన్ని నోట్లో వేసుకుని నమిలినా తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

గాలి వెలుతురు:

ఎప్పుడూ ఒకే గదిలో చీకటిలో ఉండటం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అందుకే శరీరానికి మాత్రమే కాక.. మానసిక వికాసానికి కూడా గాలి వెలుతురు చాలా అవసరం. తలనొప్పిగా అనిపించినప్పుడు కాసేపు బయటకు వెళ్లి అలా తిరిగి వచ్చినా సరిపోతుంది.

వెల్లుల్లి పేస్ట్:

కొద్దిగా వెల్లుల్లి దంచి నీటితో కలిపి పేస్టులా చేసుకోండి. ఒక టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ తిన్నా కూడా తలనొప్పి త్వరగా తగ్గుతుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె జుట్టు నల్లగా ఒత్తుగా మార్చడమే మాత్రమే కాక తలనొప్పి కి కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది.

ఈసారి తలనొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్లను వాడకుండా ఈ చిట్కాలను పాటించండి. కచ్చితంగా తలనొప్పి.. నుంచి విముక్తి లభిస్తుంది. అయితే పద్దాక తలనొప్పి ఎక్కువగా వస్తున్నట్లు.. అయితే కచ్చితంగా వైద్యులను ఒకసారి సంప్రదించి వారి అభిప్రాయం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అని మర్చిపోవద్దు. 

తలనొప్పి ఉన్నప్పుడు చేయకూడని పనులు: 

మటన్, వెన్న ఎక్కువగా తినేవారికి కూడా తలనొప్పి ఎక్కువగా వస్తుందట. తలనొప్పిగా ఉన్నప్పుడు మసాలా ఫుడ్‌ తింటే తలనొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News