Milk Substitutes : కాల్షియం కోసం పాలు మాత్రమే తాగల్సిన అవసరం లేదు.. ఇవి కూడా వాడచ్చు..

Calcium Rich Foods: మన శరీరంకి కాల్షియం ఎంతో అవసరం. కాల్షియం కొరత ఉంటే ఎముకలకి సంబంధించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా కాల్షియం కోసం కేవలం పాలు మాత్రమే తాగాల్సిన అవసరం లేదు. పాల బదులు కాల్షియం ఎక్కువగా ఉండే వేరే ఆహార పదార్థాలను తీసుకున్నా కూడా సరిపోతుంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 23, 2024, 08:34 PM IST
Milk Substitutes : కాల్షియం కోసం పాలు మాత్రమే తాగల్సిన అవసరం లేదు.. ఇవి కూడా వాడచ్చు..

Milk Alternatives : మన శరీరంలో క్యాల్షియం లోపం ఎన్నో అనారోగ్యాలకు దారి తీస్తుంది. అందుకే ప్రతిరోజు మనం తినే డైట్ లో క్యాల్షియం కూడా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కాల్షియం అనగానే అందరికీ గుర్తొచ్చేది పాలు. కానీ అందరికీ పాలు తాగడం ఇష్టం ఉండదు. క్యాల్షియం అంటే పాలలో మాత్రమే ఉండదు ఇంకా చాలా ఆహార పదార్థాల్లో ఉంటుంది. ఒకవేళ పాలు తాగడం నచ్చకపోతే వారు తమ శరీరంకి ఉపయోగపడే కాల్షియం కోసం వేరే ఆహార పదార్థాలను తీసుకుంటే సరిపోతుంది.

పాల తో తయారు అయ్యే పెరుగు లో కూడా క్యాల్షియం ఎక్కువగానే ఉంటుంది. నిజం చెప్పాలంటే పాల కంటే ఎక్కువ క్యాల్షియం పెరుగులో ఉంటుంది. పెరుగన్నంలో మీకు నచ్చిన ఫ్రూట్స్ కూడా వేసుకొని తినొచ్చు. అందులో ఉండే గుడ్ బ్యాక్టీరియా మన జీర్ణాశయానికి ఎంతో మంచిది.

ఆరెంజ్ జ్యూస్ లో కూడా క్యాల్షియం ఎక్కువగానే ఉంటుంది. కానీ అతిగా ఆరెంజ్ జ్యూస్ కూడా తాగకూడదు. రోజుకి 10 ఔన్స్ ల కంటే ఎక్కువ జ్యూస్ తాగకూడదు అని గుర్తుంచుకోండి.

ఆవు పాలు లేదా గేదె పాలు నచ్చని వారు ఓట్ మిల్క్ కూడా ట్రై చేయొచ్చు. అందులో కూడా కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది. ఇంట్లోనే తయారు చేసుకునే ఓట్ మిల్క్ లో ఇంకా ఎక్కువ పోషకాలు ఉంటాయి.

బాదం పాల లో క్యాల్షియం తో పాటు ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఏ లు కూడా ఉంటాయి. ఒక కప్పు బాదం పాలలో ఆవు పాల కంటే ఎక్కువ క్యాల్షియం ఉంటుంది. ఇంకా బాదంపాలలో క్యాల్షియం మాత్రమే కాక ప్రోటీన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అది కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. 

సోయా పాలల్లో కూడా మంచి కాల్షియం కంటెంట్ ఉంటుంది. అంతే కాక విటమిన్ డి కూడా ఉంటుంది. ఒక కప్పు సోయా మిల్క్ లో 6 గ్రాముల ప్రోటీన్ కూడా ఉంటుంది.

కాల్షియం లెవెల్స్ తగ్గిపోతే మన శరీరం కూడా బాగా నీరశపడిపోతుంది. ముఖ్యంగా బోన్స్ చాలా వీక్ అయిపోతాయి. దానివల్ల ఎముకల సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. 

తగినంత కాల్షియం లేకపోవడం వల్ల ఎముకల వ్యాధి, ఆస్టియోపెనియా, హైపోకాల్సెమియా వంటి అనారోగ్యాలు రావచ్చు. పిల్లలలో దీని లోపం ఉంటే వారి అభివృద్ధి లేట్ అవుతుంది. అలాంటి క్యాల్షియం లోపాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Read More: Taslima Mohammad:సోషల్ మీడియాలో బిల్డప్ లు.. తస్లీమా మహమ్మద్ ఆస్తులు చూసి కళ్లు తేలేస్తున్న ఏసీబీ అధికారులు..

Read More: Smita Sabharwal: వరల్డ్ బుక్ డే... వైరల్ గా మారిన స్మితా సబర్వాల్ చేసిన లేటెస్ట్ ట్వీట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News