Jasmine Flower : మల్లెపువ్వే కదా అని తీసిపారేయద్దు.. దానికి మించిన దివ్య ఔషధం లేదు..

Jasmine Flower Benefits : చూడటానికి చాలా సింపుల్ గా ఉండే మల్లె పువ్వులలో ఎన్నో అద్భుతమైన లక్షణాలు దాగి ఉన్నాయి. కేవలం తలలో పెట్టుకోవడానికి మాత్రమే కాక.. మల్లె పువ్వు వల్ల ఎన్నో మానసిక శారీరక అనారోగ్యాలు కూడా దూరం అవుతాయు. మల్లెపూలు చాలా రోగాలకు నివారణగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మరి వాటి ఉపయోగాలు ఎంతో ఒకసారి చూద్దాం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 26, 2024, 08:00 AM IST
Jasmine Flower : మల్లెపువ్వే కదా అని తీసిపారేయద్దు.. దానికి మించిన దివ్య ఔషధం లేదు..

Jasmine Flower for Health : మల్లెపువ్వు అనగానే.. చూడటానికి తెల్లగా ఉండి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది.. అని మాత్రమే చాలామందికి తెలుసు.. కానీ మల్లెపువ్వు వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సరైన పద్ధతిలో వాడితే మల్లెపువ్వు కూడా ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. 

మల్లెపువ్వు వాసన నచ్చని వారు ఉండరు. ముఖ్యంగా పువ్వులు అంటే ఇష్టం ఉన్న అమ్మాయిలకు మల్లె పువ్వులు అంటే ప్రత్యేక ఇష్టం ఉంటుంది. అయితే చాలామంది తలలో పెట్టుకోవడానికి, దేవుడికి పూజకు మాత్రమే మల్లెపూలను వాడుతూ ఉంటారు. కానీ మల్లెపువ్వు వల్ల మనకి తెలియకుండా బోలెడు ఉపయోగాలు ఉన్నాయి.. అని నిపుణులు చెబుతున్నారు. 

మల్లెపువ్వుని ఒక దివ్య ఔషధంగా కూడా వాడొచ్చు. అందులో ఉండే అనేకమైన ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి అని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో శారీరక, మానసిక సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి మల్లెపువ్వు చాలా బాగా పనిచేస్తుంది. 

మల్లెపువ్వు వల్ల లాభాలు:

మల్లె పువ్వు.. మన శరీరంలో ఉన్న హార్మోర్ల ను కూడా సమతుల్యం చేయగల సత్తా ఉన్న పువ్వు. ఆసియా ఖండంలో ఎన్నో ప్రాంతాల్లో మల్లెనూనను డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి వంటి ఎన్నో ప్రాబ్లమ్స్ కి సహజ నివారణగా వాడుతుంటారు.

చలికాలంలో చాలా మంది కీళ్ల నొప్పులు తో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు వారు జాస్మిన్ ఆయిల్ తో మసాజ్ చేసుకుంటే అందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను చాలావరకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. 

ఇక మల్లెపూల వల్ల ఎన్నో జుట్టు సమస్యలు కూడా దూరం అవుతాయి. చూడటానికి తెల్లగా కనిపించే మల్లెపువ్వు ఆయిల్ ని కుదుళ్లకు బాగా పట్టిస్తే మన జుట్టు నల్లగా మారుతుంది. తెల్ల వెంట్రుకలు పోయి మన జుట్టు నల్లగా పొడవుగా పెరుగుతుంది. కుదుళ్ళ లోపలకి వెళ్లి మరీ జాస్మిన్ ఆయిల్ మన జుట్టుని ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది.

ఇలా మల్లె పువ్వుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చూడటానికి అందంగా ఉండే మల్లెపువ్వు, మంచి సువాసనలు వెదజల్లే మల్లెపువ్వు మనల్ని కూడా అందంగా మార్చగలదు. మల్లె పువ్వులతో చేసే జాస్మిన్ టీ వాళ్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ టీ తాగడం మన శరీరంలో ఉండే చెడు బ్యాక్టీరియా పోయి మంచి బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది. దానివల్ల జీర్ణ సమస్యలు తగ్గి బరువు కూడా తగ్గుతాము. 

మొత్తానికి మనం ఒక పువ్వులా చూసే మల్లె పువ్వులో..మన ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇన్ని లాభాలు ఉన్నాయి మరి. ఇంకెందుకు ఆలస్యం ఈసారి మల్లెపూలు తీసుకున్నప్పుడు పైన చెప్పినవి ఫాలో అయిపోండి.

Also Read: Amit Shah: రేవంత్‌ రెడ్డిపై అమిత్‌ షా ఫైర్‌.. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎమ్‌ చేశారని తీవ్ర వ్యాఖ్యలు

Also Read: KCR Live: రేవంత్ రెడ్డికి చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నేనే రిపేర్‌ చేస్తా: కేసీఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News