Fruits for Healthy Kidney: మనిషి శరీరంలో గుండె, కిడ్నీ, లివర్ అత్యంత కీలకమైన అంగాలు. ఈ మూడింట్లో ఏ అంగం పనితీరు చెడినా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. ఈ మూడు అంగాల ఆరోగ్యం అనేది ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ అంగాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
ప్రస్తుతం మనం కిడ్నీల గురించి తెలుసుకుందాం. కిడ్నీల పనితీరు సక్రమంగా ఉన్నంతవరకూ శరీరంలో చాలా సమస్యలు దరిచేరవు. అందుకే వివిధ రకాల పదార్ధాలను లేదా ఫ్రూట్స్‌ని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కిడ్నీల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, పని తీరు మెరుగుపర్చేందుకు కొన్ని ప్రత్యేకమైన పండ్లు తప్పకుండా తినాలి. శరీరంలోని చెడు లేదా వ్యర్ధ పదార్ధాలను ఫిల్టర్ చేసి బయటకు పంపించే ప్రక్రియ కిడ్నీల వల్లే జరుగుతుంటుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయిని కిడ్నీలు నియంత్రిస్తుంటాయి. రక్తాన్ని శుభ్రం చేసి శరీరం నుంచి విష పదాదార్ధాలను బయటకు పంపించేస్తుంది. అందుకే కిడ్నీలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. లేకపోతే ఈ పనుల్లో అంతరాయం కలిగి అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.
పైనాపిల్ అనేది కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే బ్రోమెలైన్ ఎంజైమ్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నిండుగా ఉంటాయి. ఫలితంగా కిడ్నీలో స్వెల్లింగ్ సమస్య తగ్గుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పెద్దమొత్తంలో ఉండటం వల్ల ఇమ్యూనిటీ బలపడుతుంది.
Also Read: Weight loss tips: రాత్రి వేళ ఈ పొరపాట్లు చేస్తే స్థూలకాయం సమస్యలు తప్పవు
బ్లూ బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఏంథోకయానిన్ పెద్దమొత్తంలో ఉంటాయి. ఫలితంగా స్వెల్లింగ్ వంటి సమస్యలు తగ్గుతాయి. కిడ్నీలు పాడవకుండా కాపాడుతుంటాయి. ప్రత్యేకించి యూరినరీ ట్రాక్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఆపిల్‌లో పుష్కలంగా ఉండే ఫైబర్ కారణంగా కిడ్నీలు డీటాక్స్ అవుతాయి. ఇందులో ఉండే పేక్టిన్ అనే కాంపౌండ్ కారణంగా శరీరంలో విష పదార్ధాలు బయటకు తొలగుతాయి. ఆపిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి.
నిమ్మకాయలు కిడ్నీలు డీటాక్స్ చేయడంలో కీలకంగా ఉపయోగపడతాయి. వేసవి కావడంతో నిమ్మరసం ఆరోగ్యానికి కూడా మంచిది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిమ్మరసం ఉపయోగపడుతుంది. నిమ్మరసంతో యూరిన్ ఉత్పత్తి పెరిగి శరీరం డీటాక్సిఫై అవుతుంది.
కిడ్నీ ఆరోగ్యానికి అద్భుతంగా దోహదపడే మరో ఫ్రూట్ వాటర్ మెలన్. వాటర్ మెలన్ రోజు తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు దూరమౌతాయి. ఎందుకంటే వాటర్ మెలన్ ఒక హైడ్రేటింగ్ ఫ్రూట్. ఇందులో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ. దీనివల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. వాటర్ మెలన్స్ అనేవి కిడ్నీ ఆరోగ్యానికి అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి.
Also Read: Bloating Remedies: ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా కడుపు ఉబ్బరాన్ని కేవలం 5 నిమిషాల్లో తగ్గించుకోవచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి