Healthy Foods For Liver Health: శరీరంలో ప్రోటీన్లు, కొలెస్ట్రాల్, విటమిన్స్, మినెరల్స్, కార్బోహైడ్రేట్స్ ని నిల్వ చేయడంతో పాటు అనేక కీలకమైన పనుల్లో కాలేయందే కీలకమైన పాత్ర అనే విషయం తెలిసిందే. కాలేయం అనేది ఒక రకంగా మినెరల్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ల పని తీరులో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లోవ్నీత్ బాత్రా మాట్లాడుతూ, " కాలేయం అనేది శరీరంలోని అవయవాలకు శక్తినిచ్చే కేంద్రంగా పనిచేస్తుంది " అని అన్నారు.
కాలేయం అంటే రక్తంలోని మలినాలను తొలగించడం నుండి జీర్ణక్రియను ప్రోత్సహించడం, విటమిన్స్ నిల్వ చేసి వాటిని తరువాత ఉపయోగించుకునేందుకు తోడ్పడటం వంటి పనులు చేస్తుంది. కాలేయం మనం తినే ఆహారాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే కాలేయం ఆరోగ్యంగా కాపాడుకోవడం చాలా ముఖ్యం.. అలాగే కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు మంచి హెల్తీ ఫుడ్ తినడం కూడా అంతే అవసరం. ఆ హెల్తీ ఫుడ్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ గడ్డి : గోధుమ గడ్డిలో క్లోరోఫిల్ ఎక్కువగా ఉంటుంది. ఈ క్లోరోఫిల్ విషతుల్యాలను తొలగించడంలో సహాయపడుతుంది. తద్వారా కాలేయం పనితీరు కూడా మెరుగుపడుతుంది.
బీట్రూట్ జ్యూస్ : బీట్రూట్ జ్యూస్ లో నైట్రేట్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటినే బెటాలైన్స్ అని కూడా పిలుస్తారు. ఇవి కాలేయం డ్యామేజ్ కాకుండా చేయడంతో పాటు కాలేయం వాపును నివారిస్తుంది.
ద్రాక్ష: ఎరుపు రంగు ద్రాక్ష కాలేయం పని తీరును మెరుగుపరుస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్ల స్థాయిని పెంచిస వాపును తగ్గిస్తుంది.
కూరగాయలు : బ్రోకలీ, మొలకలు వంటివి కాలేయం కాలేయం పని తీరును మెరుగుపరిచి ఎంజైమ్స్ పెంచడంలో సహాయపడతాయి
వాల్నట్స్ : కొంతమందికి కాలేయం వాపుతో ఉండటం జరుగుతుంది. ఈ ఫ్యాటీ లివర్ వ్యాధిని తగ్గించడంలో వాల్నట్స్ ఎంతో సహాయపడతాయి. వాల్నట్స్లో ఒమేగా-6, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.