How To Stop White Hair: జుట్టు తెల్లబడకుండా ఉండటం మీ చేతుల్లోనే..

How To Stop White Hair Growth: వయస్సు పెరిగే కొద్దీ జుట్టు తెల్లబడటం అనేది అత్యంత సహజం. కానీ కొంతమందిలో చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం అనేది కనిపిస్తుంది. అయితే, చిన్న వయస్సులో జుట్టు తెల్లబడకుండా ఉండాలన్నా.. లేదా వయస్సు పైబడుతున్నప్పటికీ తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే సందేహం చాలామందిని వేధిస్తుంటుంది. సరిగ్గా అలాంటి వారి కోసమే ఇదిగో ఈ డీటేల్స్.

Written by - Pavan | Last Updated : Jul 29, 2023, 08:37 PM IST
How To Stop White Hair: జుట్టు తెల్లబడకుండా ఉండటం మీ చేతుల్లోనే..

How To Stop White Hair Growth: చిన్న వయస్సులో జుట్టు తెల్లబడటం అనేది ఇటీవల కాలంలో సర్వసాధారణం అయింది. చాలామందిలో ఈ సమస్య కనిపిస్తోంది. ఒకసారి జుట్టు తెల్లబడ్డాకా చేయడానికి పెద్దగా ఏమీ ఉండదు కానీ తెల్ల జుట్టు రాకముందే లైఫ్ స్టైల్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం రండి. 

మంచి పోషకాహారం : 
ప్రతీ రోజు విటమిన్స్, మినెరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, గ్రీన్ వెజిటేబుల్స్, సీడ్స్, నట్స్, చేపలు, జుట్టుకి మేలు చేసే పండ్లు తినాలి.

విటమిన్ B12 :
విటమిన్ B12 అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అవేంటంటే.. కోడి గుడ్లు, పాల ఉత్పత్తులు, పప్పు ధాన్యాలు వంటి పౌష్టికాహారం తీసుకోవాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. జుట్టు తెల్లబడటానికి విటమిన్ B12 లోపం అనేది ఒక ప్రధాన కారణం అనే విషయం తెలిసిందే.

మానసిక ఒత్తిడి :
తీవ్రమైన ఒత్తిడి అనేది చిన్న వయస్సులో జుట్టు తెల్లబడటానికి ఒక కారణంగా నిపుణులు చెబుతుంటారు. అందుకే మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెడిటేషన్, యోగా చేయండి. లేదంటే డీప్‌గా శ్వాస తీసుకుంటూ మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. వీలైనంత వరకు రిలాక్స్ అవ్వడానికే ప్రయత్నించండి.

స్మోకింగ్ చేస్తున్నారా ?
స్మోకింగ్ అనేది కేవలం గుండెపైనే కాదు.. చిన్న వయస్సులో జుట్టు తెల్లగా అవడానికి ముఖ్య కారణాల్లో ఇది కూడా ఒకటి. అందుకే పొగ తాగే అలవాటుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 

నీళ్లు ఎక్కువగా తాగాలి :
నీళ్లు ఎక్కువగా తాగే అలవాటు చేసుకోవాలి. నీళ్లు తక్కువ తాగితే మీ తలపై మాడు పొడిబారిపోయి జుట్టు పెరుగుదలపై ప్రభావమే చూపడమే కాకుండా ఉన్న జుట్టును తెల్లగా మార్చుతుంది. అందుకే నీళ్లు సమృద్ధిగా తాగాలి.

జుట్టుపై ప్రయోగాలు మానుకోవాలి :
కొంతమందికి జుట్టుపై తరచుగా ప్రయోగాలు చేసే అలావటు ఉంటుంది. జుట్టుకు కలర్ వేయడం, వేడి చేసి జుట్టును స్టైల్ గా వంగేలా చేయడం, అడ్డమైన రసాయనాలను జుట్టుకు పట్టించడం, గట్టిగా లాగిపెట్టి జుట్టు వేసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవన్నీ మీ జుట్టును పెరగనివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా సహజమైన రంగును కోల్పోయేలా చేస్తాయి అని మర్చిపోవద్దు. 

సూర్య రష్మి ప్రభావం :
నేరుగా సూర్య రష్మి తగిలినప్పుడు సోకే యూవీ కిరణాలు జుట్టును పాడు చేస్తాయి. అందుకే ఎండలో పని చేయాల్సి వచ్చినప్పుడు క్యాప్ ధరించడం లేదా జుట్టును ఏదైనా గుడ్డతో కవర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి.

మాడుకు మసాజ్ : 
మాడుకు మసాజ్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగుపడుతుంది. మాడులో రక్త ప్రసరణ సరిగ్గా ఉంటే, అది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. 

సహజ పద్ధతిలో హెయిర్ కేర్ :
జుట్టుకు సహజ పద్ధతిలో సంరక్షణ తీసుకోవాలి. జుట్టుకు హానీ చేసే రసాయనాలను జుట్టుకు ఉపయోగించొద్దు. 

హెయిర్ కేర్ స్పెషలిస్టుని సంప్రదించండి : 
చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం, లేదా జుట్టు ఊడటం వంటి పరిణామాలు మీకు ఆందోళన కలిగిస్తున్నాయా.. అలాంటప్పుడు సొంత వైద్యంతో సమయం వృధా చేయకుండా హెయిర్ కేర్ స్పెషలిస్టుని సంప్రదించండి.

Trending News