Health Tips: పైల్స్ అనేది ఓ నరకయాతన. మల విసర్జన కష్టమై దారుణమైన పరిస్థితి ఉంటుంది. వేసవిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. ఎలా ఉపశమనం..ఆయుర్వేద వైద్యం ఏం చెబుతోంది. వేసవిలో ఈ సమస్య ఎదుర్కోవాలంటే ఏం చేయాలి.
మండు వేసవిలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి.ముఖ్యంగా ఫైల్స్ సమస్య అధికమౌతుంది. వేసవిలో సహజంగా శరీరంలో నీటి శాతం తగ్గనుండటంతో పైల్స్ సమస్య పెరుగుతుంది. అయితే పైల్స్‌కు ఆయుర్వేదంలో మంచి వైద్యం, చికిత్స, ఉపశమన పద్ధతులున్నాయి. ఆ పద్ధతులేంటో తెలుసుకుందాం.
మొలలు ఎందుకొస్తాయి
ఆహార పదార్ధాల్లో మార్పులు, మలబద్ధకం తరచూ ఉండటంతో మొలలు ఏర్పడతాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నా మొలలు వస్తాయి. స్థూలంగా చెప్పాలంటే మల విసర్జన సాఫీగా లేనప్పుడు మొలలు ఏర్పడతాయి. అయితే సరైన ఆహార పదార్ధాలతో మొలలు రాకుండా నియంత్రించవచ్చు. వేసవి కాలంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. వేసవిలో శరీర వేడి కారణంగా కూడా మొలలు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు.
మొలల్ని నియంత్రించేందుకు ఎక్కువగా ఆకుకూరలు, జామ, దానిమ్మ పండ్లు తీసుకోవాలి. కూర్చునే ప్రదేశం సాధ్యమైనంతవరకూ మెత్తగా ఉండేట్టు చూసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా మజ్జిగ తాగేటప్పుడు కాస్త నిమ్మరసం, ఉప్పు కలిపి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అల్లం, తేనె, నిమ్మరసం, పుదీనా నీళ్లలో కలిపి తాగితే పైల్స్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా ఆయర్వేదంలో చాలా చికిత్స పద్ధతులున్నాయి.
వేసవిలో మొలల్నించి రక్షించుకునేందుకు టిప్స్
జీలకర్ర పొడి ఓ అర టీస్పూన్ గ్లాసు నీళ్లలో కలుపుకుని ప్రతిరోజూ తాగితే పైల్స్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. గ్లాసు నీటిలో కొద్దిగా ఉల్లిరసం, పంచదార కలిపి కూడా తీసుకోవచ్చు. ఇక మరో పద్ధతి..తులసి ఆకుల్ని నీటిలో నానబెట్టి తరచూ చప్పరిస్తుంటే ఫలితం ఉంటుంది. మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. వేసవిలో అయితే ఒంటికి చలవ చేసే పదార్ధాల్ని ఎక్కువగా తీసుకోవాలి. మారేడు కాయల్ని తీసుకుని..మధ్యలో ఉండే గుజ్జును చెంచా పెరుగులో కలుపుకుని తింటే వెంటనే ఫలితముంటుంది. మెంతుల్ని ప్రతిరోజూ రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం తాగితే మేలు చేకూరుతుంది.
Also read: Dark chocolate Benefits: డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మేలు చేస్తుందా? కీడును కలిగిస్తుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook