Health Tips: ఈ నాలుగు చెడు అలవాట్లను మర్చిపోండి.. ఒత్తిడిని తరమికొట్టండి

Health Tips in Telugu: మీరు వర్క్ ప్రెజర్‌, ఫ్యామిలీ టెన్షన్స్‌తో ఒత్తిడికి గురవుతున్నారా..? ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా..? ముందుగా మీలో ఉన్న చెడు అలవాట్లను గుర్తించండి. వాటిని అధికమిస్తే.. మీ సమస్యలు ఈజీగా పరిష్కారం అవుతాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2023, 06:46 PM IST
Health Tips: ఈ నాలుగు చెడు అలవాట్లను మర్చిపోండి.. ఒత్తిడిని తరమికొట్టండి

Health Tips in Telugu: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో మంది ఒత్తిడితో జీవిస్తున్నారు. వర్క్ టెన్షన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, డబ్బు సమస్యకు తోడు అనారోగ్య సమస్యలతో చాలా మంది జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఒత్తిడి కారణంగా చేస్తున్న పనిపై పూర్తిస్థాయిలో దృష్టిసారించలేకపోతున్నారు. మీరు కూడా నిత్యం వర్క్ ప్రెజర్ ఫీలవుతూ ఆందోళన చెందుతున్నారా..? అయితే మీలో ఉన్న కొన్ని అలవాట్లను దూరం చేసుకోండి. ఆ చెటు అలవాట్ల కారణంగా మీలో మానసిక ప్రశాంతత కరువై ఉంటుంది. మీ మెదడును దెబ్బ తీసి.. మానసికంగా ఇబ్బంది పెడుతున్న ఆ చెడు అలవాట్లు ఏంటంటే..? 

నిద్రలేమి సమస్యలు..

సాధారణంగా రోజులో 7 నుంచి 8 గంటలు నిద్రపోతే.. మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. సరిగా నిద్రపోకపోతే ఆ ప్రభావం మీ మెదడుపై పడుతుంది. దీంతో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవ్వడంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. మీ శరీరానికి తగినంత విశ్రాంతినివ్వండి.

మద్య పానం అధికంగా సేవించడం.. 

ప్రస్తుతం చాలా మంది మద్యానికి బానిసలవుతున్నారు. మీకు రోజూ ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే.. దాని ప్రభావం క్రమంగా మీ మనస్సుపై పడుతుంది. ఇది మీ జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. ఆల్కహాల్‌తోపాటు స్మోకింగ్‌ను పూర్తిగా మానేసి.. ఆరోగ్యంగా ఉండండి.

ఎక్కువగా పాటలు వినడం అలవాటు

చాలామంది చెవిలో హెడ్‌సెట్ పెట్టేసుకుని గంటల తరపడి పాటలు వింటుంటారు. చదువుకుంటున్నా.. ఏదైనా పని చేసుకుంటున్నా.. జిమ్ చేస్తున్నా.. పాటలు వినడం మాత్రం ఆపేయరు. ఈ పాటలు వినే అలవాటు మీ మనసును బలహీనపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మీ మనస్సుపైనే కాకుండా మీ చెవులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. 

జంక్ ఫుడ్ తినడం..

ప్రస్తుతం మనలో కొంతమంది ఇంట్లో చేసిన వంటలు మానేసి.. బయట దొరికే జంక్ ఫుడ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. జంక్ ఫుడ్ తింటే..  మీ మెదడు సామర్థ్యంపై చాలా చెడు ప్రభావం చూపుతుంది. వీలైనంత వరకు ఈ జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. 

(గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దీనిని ధృవీకరించలేదు.) 

Also Read: Team India: బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీకి రెడీ.. ఆ బౌలర్ మాత్రం ఎప్పుడంటే..!   

Also Read: AP Team in IPL: ఐపీఎల్‌లో ఏపీ టీమ్.. రూట్ మ్యాప్ సిద్ధం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News