Fruits Benefits: ఏయే పండ్లు తొక్కతో సహా తినాలి, తొక్కతో తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Fruits Benefits: పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడూ వదలకూడదు. ఆరోగ్యానికి కావల్సిన సమస్య పోషక విలువలు పండ్లలో సమృద్ధిగా లభిస్తాయి. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 6, 2023, 12:51 AM IST
Fruits Benefits: ఏయే పండ్లు తొక్కతో సహా తినాలి, తొక్కతో తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Fruits Benefits: పండ్లు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. అయితే చాలామంది అన్నిరకాల పండ్లను ఒకేలా తింటుంటారు. అంటే ప్రతి పండును తొక్క ఒలిచి తినేస్తుంటారు. ఇది సరైన విధానం కాదు. ఏ పండ్లు ఒలిచి తినాలి, ఏవి తొక్క ఒలవకుండా తినాలో తెలుసుకుందాం..

మెరుగైన ఆరోగ్యం కోసం పండ్లను డైట్‌లో భాగంగా చేసుకోవాలి. అదే సమయంలో పండ్లు తినే విధానం కూడా తెలుసుకోవాలి. కొన్ని పండ్లను తొక్కతో సహా తినాల్సి ఉంటుంది. కొన్నింటిని తొక్క ఒలిచి తినాలి. లేకపోతే వాటిలో ఉండే పోషకాలను మనం కోల్పోతాం. ఎందుకంటే చాలా రకాల పండ్ల తొక్కల్లో కూడా న్యూట్రియంట్లు ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే దాదాపు అన్నిరకాల పండ్లకు కెమికల్స్ కలుస్తున్నందున ప్రతి ఒక్కరూ తొక్క ఒలిచి తింటుంటారు. కానీ తొక్క ఒలిచి తినిడం వల్ల ఆరోగ్యరీత్యా హాని చేకూరుతుంది. అందుకే ఏ పండ్లను తొక్క ఒలిచి తినకూడదో తెలుసుకుందా.ం..

కివి ఫ్రూట్స్ విషయంలో అందరూ ఒకే తప్పు చేస్తుంటారు. అది తొక్క ఒలిచి తినడం. కానీ కివీ పండ్లను తొక్క ఒలిచి తినాల్సి ఉంటుంది. ఎందుకంటే కివీ పండ్లలో ఫైబర్, ఫోలేట్, విటమిన్ ఇ వంటి పోషకాలు చాలా ఉంటాయి.

పియర్ ఫ్రూట్స్ కూడా చాలా మంది తొక్క ఒలిచేస్తుంటారు. పియర్ పండ్ల తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కావల్లినన్ని ఉంటాయి. పియర్ ఫ్రూట్ తొక్కలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక మూడవది చీకూ ఫ్రూట్స్.ఇవి తొక్క ఒలవకుంటా తినాలి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇక జాంకాయలు ఎప్పుడూ తొక్కతో సహా తినాల్సి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. అదే విధంగా యాపిల్ కూడా తొక్కతో సహా తింటే యాపిల్ ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. యాపిల్ తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందుకే యాపిల్ ఎప్పుడు తిన్నా తొక్కతో సహా తినాలి.

Also read: Side Effects of Bananas: అరటి పండ్లతోనూ సైడ్ ఎఫెక్ట్స్.. తెలుసుకోకపోతే తిప్పలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News