కొలెస్ట్రాల్ అనేది సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. ప్రతి పదిమందిలో ఐదుగురిలో ఈ సమస్య కన్పిస్తోంది. కొలెస్ట్రాల్ కారణంగా ఇతర తీవ్రమైన వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాలను దూరం చేయడం, మరి కొన్ని పదార్ధాలను చేర్చడం ద్వారా కొలెస్ట్రాల్ నియంత్రణ సాధ్యమే. అంటే కొలెస్ట్రాల్ నియంత్రణ అనేది పూర్తిగా ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.
కొలెస్ట్రాల్ అనేది మనిషి శరీరంలో మైనంలా ఉండే పదార్ధం. మనిషి ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ అవసరమే. కానీ తగిన మోతాదులో ఉండాలి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ప్రమాదకరంగా మారుతుంది. అనారోగ్యకర పదార్ధాలు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంటుంది. ఈ క్రమంలో గుండెను, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే..రోజూ ఆవకాడో తింటే చాలా మంచి ఫలితాలుంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆవకాడో రోజూ తీసుకుంటే చాలా లాభాలున్నాయి.
ఆవకాడోతో కొలెస్ట్రాల్ నియంత్రణ
ఒకవేళ రోజూ ఆవకాడో తినడం అలవాటు చేసుకుంటే..ఆరోగ్యానికి సంబంధించి చాలా ప్రయోజనాలున్నాయి. ఆవకాడో వినియోగంతో మీ కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఆవకాడో సేవించడం వల్ల నాళికల్లో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ సులభంగా బయటకు తొలగిపోతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
అధిక బరువుకు చెక్
ఆవకాడోను సూపర్ ఫుడ్ కేటగరీలో ఉంచవచ్చు. శరీర బరువును చాలా సులభంగా తగ్గించవచ్చు. ఆవకాడో జ్యూస్ తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు చాలా సులభంగా కరుగుతుంది. ఆవకాడో రోజూ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. అయితే ఆవకాడో కూడా మోతాదు మించి తినకూడదు. లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది.
Also read: Saturn Rise 2023: మార్చ్ 5 నుంచి ఆ 4 రాశులకు కష్టాలు ప్రారంభం, తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook